రిశూల్ పీక్, ఔలి

రిశూల్ పీక్, ఔలి

సముద్ర మట్టానికి 23490 అడుగుల ఎత్తులో ఉన్నఈ త్రిశూల్ శిఖరం ఔలి లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ శిఖరంనకు పేరు శివ త్రిశూలము నుండి వచ్చింది. ఈ ప్రదేశము ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ చెందిన రాత్రి గస్తీ తిరిగే అధికారులకు శిక్షణ మైదానంగా ఉన్నది. శిఖరం...

read more
విశేషాల వంతెన!

విశేషాల వంతెన!

మనదేశంలో పొడవైన రైల్‌ కమ్‌ రోడ్‌ వంతెన బోగీబీల్‌. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఎన్నో లాభాలు చేకూరనున్నాయి. ఆ వంతెన విశేషాలు తెలుసుకుందామా! బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతి పొడవైన రైలు కమ్‌ రోడ్డు వంతెన...

read more
ఇక్కడ ఎప్పుడు ట్రెక్కింగ్ వెలుతారో తెలుసా?

ఇక్కడ ఎప్పుడు ట్రెక్కింగ్ వెలుతారో తెలుసా?

రాత్రిపూట ట్రెక్కింగ్ వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. సాధారణంగా పగటిపూట ట్రెక్కింగ్ వెళ్లడంతో పోలిస్తే రాత్రి పూట ట్రెక్కింగ్ కొంత థ్రిల్‌గా అనిపించడం సాధారణమే. ఇటువంటి రాత్రిపూట ట్రెక్కింగ్‌కు అనుకూలమైన ప్రాంతాలను మనం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అటువంటి వాటిలో పెరియార్...

read more
కుంబల్‌ఘర్ కోట

కుంబల్‌ఘర్ కోట

భారతదేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. పురాణ కాలంతో పాటు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కట్టడాలను మనం ఈ దేశంలో చూడవచ్చు. అందులో కొన్ని అప్పటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా చెబుతారు. మరికొన్నింటిని అటప్పటి యుద్ద నైపుణ్యాలకు నిలయంగా నిర్మించారు. అటువంటి కోవకు...

read more
ప్రకృతి వనం..ఈ భూలోక స్వర్గం!

ప్రకృతి వనం..ఈ భూలోక స్వర్గం!

స్వేచ్ఛకు సంకెళ్లేసిన చోట! చాలా ఏళ్ల క్రితం మలయాళ నటుడు మోహన్‌లాల్‌ నటించిన ‘కాలాపానీ’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఓ కారాగారంలో స్వాతంత్య్ర సమరయోధులను బంధించి ఆంగ్లేయులు నానా చిత్రహింసలు పెడతారు. పోర్ట్‌బ్లెయిర్‌లోని ‘సెల్యులార్‌ జైల్‌’లో అప్పట్లో జరిగిన అరాచకాలనే ఈ...

read more
భళారేస్

భళారేస్

ఫార్ములా వన్‌ పవర్‌బోట్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప. ఎఫ్‌1హెచ్‌2వో వరల్డ్‌ చాంపియన్‌షి్‌పగా ప్రసిద్ధం. అంతర్జాతీయంగా పేరుపొందిన మోటార్‌ బోట్‌ రేసింగ్‌ ఇది. ఇన్‌షోర్‌ పవర్‌బోట్‌ రేసింగ్‌ల్లో ఎఫ్‌1హెచ్‌2వోను మించింది లేదు. ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌తో పోల్చదగిన ఈ పోటీలకు...

read more
మంచు కొండల్లో క్రూయిజ్‌ విహారం

మంచు కొండల్లో క్రూయిజ్‌ విహారం

మంచు దుప్పటి కప్పుకున్న ఖండం అంటార్కిటికా. వెన్నెలంత తెల్లదనాన్ని, ఆ చల్లదనాన్ని తనలో ఇముడ్చుకున్న అంటార్కిటికా అందాలు అక్షరాలకు అందనివి. మరో ప్రపంచంలోకి స్వాగతించే అంటార్కిటికా సముద్రం మధ్యలోనే మంచు దిబ్బలు ఉంటాయి. తీరాల్లో పెంగ్విన్లు, సీల్స్‌ సందడి చేస్తూ ఉంటాయి....

read more
లక్నవరం ఫెస్టివల్‌

లక్నవరం ఫెస్టివల్‌

ఆహ్లాదభరితమైన వాతావరణంలో, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకొనే వారి కోసం తెలంగాణ అటవీశాఖ ‘లక్నవరం ఫెస్టివల్‌’ నిర్వహిస్తోంది. దసరా సెలవుల సందర్భంగా పర్యాటకులను ఆకట్టుకొనే అనేక అంశాలు ఈ వేడుకలో భాగంగా ఉంటాయి. ఎక్కడ?: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్నవరంలో ఎప్పుడు?: ప్రతి...

read more
మనసు దోచే మారేడుమిల్లి

మనసు దోచే మారేడుమిల్లి

ప్రకృతి అందాలు, ఆహ్లాదాన్ని ఇచ్చే జలపాతాలు, వన్యప్రాణులు, అరుదైన పక్షులు, లోయలు, ఆకాశాన్ని తాకినట్టు ఉండే పర్వత సానువుల మధ్య విహారం మధురానుభూతులను మిగుల్చుతుంది. అలాంటి అనుభవాలను కోరుకొనే వారిని ఆహ్వానిస్తోంది తూర్పు గోదావరి జిల్లా ‘వనవిహారి’ ఎకో టూరిజం ప్రాజెక్ట్‌....

read more
ఎడారికి వసంతం!

ఎడారికి వసంతం!

నవంబర్‌ మాసం రాగానే గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో సందడి మొదలవుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు మన దేశంలో సందర్శించే ప్రధానమైన వేడుకల్లో ఒకటైన ‘రణ్‌ ఆఫ్‌ కచ్‌’ ఫెస్టివల్‌ (కచ్‌ ఎడారి పండుగ- రణ్‌ ఉత్సవం) అప్పుడే మొదలవుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు ఎడారిలో సుమారు మూడున్నర...

read more

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా..?

పూజగది అనేది ఇల్లు లేదా ఆఫీసులో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ధ్యానం మరియు ప్రశాంతతకు పూజగది కేంద్రం. ఇంట్లో పూజగది ఏ ప్రాంతంలో ఉన్న మంచిదే అని భావిస్తుంటారు. అయితే దీనిని వాస్తుశాస్త్రం ప్రకారం ఉంచినట్లయితే, దీని నుండి భక్తులు శోషించుకునే శక్తి రెట్టింపవుతుంది. పూజగది కొరకు వాస్తు చిట్కాలు పాటించడం వలన గృహం మొత్తంలో ఉండే సానుకూల శక్తిని రెట్టింపు చేయవచ్చును.

గృహానికి ఈశాన్య స్థానం పూజగది నిర్మించడానికి అత్యుత్తమైనది. వాస్తు పురుషుడు తన తల ఈశాన్య దిక్కులో పెట్టి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోనే ప్రతిరోజూ ఉదయం సూర్యకిరణాలను పొందుతుంది. ఇది వాతావరణాన్ని పరిశుద్ధం చేసి రోజంతటికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. అయితే, గృహం యొక్క నిర్మాణం అదేవిధంగా ఇంటి పెద్ద యొక్క పుట్టిన రోజు ఆధారంగా ఈ దిక్కు మారుతుంది. అందుకని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా.. అంటే వాస్తు ప్రకారం, ప్రధాన ద్వారానికి ఎదురుగా పూజగది ఉండరాదు. ఎందుకంటే ఇది పూజగదిలో సృష్టించబడ్డ సానుకూల శక్తిని తగ్గిస్తుంది. పూజగది అనేది మీ ఇంట్లో దేవుని గది.. అందువలన గదిని చీకటిగా ఉంచరాదు. పూజగదిలో చీకటిగా ఉండడం వలన మొత్తం ఇంటి యొక్క స్వస్థత దెబ్బతింటుంది. అందువలన ఈ గదిలో కనీసం ఒక దీపం వెలిగించడం మంగళకరం.

ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పూజగది ఉంచరాదు. ఇది విశ్రాంతి, వినోదం కొరకు ఉపయోగించే ప్రదేశం. అలానే టాయిలెట్ యొక్క వ్యతిరేక శక్తి ఇంట్లో వ్యాపించకుండా నిరోధించడం కొరకు ఈ గదిపైన, దిగువన లేదా ఎదురుగా టాయిలెట్‌ని రూపొందించరాదు.

కొబ్బరికాయ నిలువుగా పగిలితే..

గుడికి వెళ్లినా, పండుగలు చేస్తున్నా దేవున్ని పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రామాయణ, మహాభారతాలలో కూడా టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి.

దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మంది వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురౌతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది.

కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళై వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని సూచన.

టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. చింతించాల్సిన అవసరంలేదంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. పండుగ రోజు దేవుడికి పూలు, టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట. సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట.

ఆత్మవిచారణతోనే యోగ స్థితి

కస్త్వం కో హం కుత ఆయాతః
కామే జననీ కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
పాప, పుణ్య భావాలే లేని యోగి స్థితి మనిషికి రావాలంటే ఏం చేయాలో తెలిపే శ్లోకమిది. శంకర భగవత్పాదులవారి శిష్యులైన యోగానందులవారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. మనిషి ఆత్మానుభూతి చెందాలంటే.. ‘నేను పరమాత్మను’ అనే అనుభూతి కలగాలంటే నిరంతరం ఆత్మ విచారణ చేయాలి. ‘నేనెవరు? నీవెవరు? ఎక్కణ్నుంచి వచ్చాం? ఈ తల్లిదండ్రులెవరు?’ అని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సరైన సమాధానాలు రాబట్టుకోవడమే ఆత్మవిచారణ అని ఈ శ్లోకం భావం. ఆత్మవిచారణ వల్లనే ఆత్మను గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆత్మవిచారణలో భాగంగా వేసుకునే ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా ఎవరో ఒకరు చెబితే రావు. స్వయంగా వెతకాలి. విచారణ చేయాలి. విశ్లేషణ చేయాలి. అందుకు నిర్మలమైన మనోబుద్ధులు కావాలి. అంటే.. ప్రాపంచిక విషయాలలో చిక్కుపడనివి. మన మనసు, బుద్ధి ఈ ప్రపంచంలోని అనిత్యమైన విషయాల మీద, భోగాల మీద నిలిచి కలుషితమైపోయి ఉంటున్నాయి. కనుక ఆ కల్మషాలను ముందు వదిలించాలి. అసలు మన మనసు ప్రాపంచిక విషయాల్లో ఎందుకు చిక్కుబడిపోయిందంటే..

ప్రపంచంపై సరియైున అవగాహన లేకనే. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవడం వల్లనే.. ‘ఇది నిత్యమైనది, సత్యమైనది, దీని ద్వారా మనం ఆనందాన్ని పొందవచ్చు’ అని భ్రమపడతాం. కనుక ముందు ప్రపంచం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి. ఈ విశ్వం ‘స్వప్నవిచారం’ అని పెద్దలు చెబుతున్నారు. అంటే.. కల లాంటిది. స్వప్నం అబద్ధమని మనకు తెలుసు. కలలో లాభం వస్తే.. అది నిజమైనది కాదు గనుక సంతోషించాల్సిన పని లేదు. నష్టం వస్తే చింతించాల్సిన పనీ లేదు. లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, సుఖమైనా.. మెలకువ వచ్చేంతవరకే. మన జీవితమూ అంతే. మనిషి జాగ్రదావస్థలోంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే.. నిజస్వరూపమైన ఆత్మగా నిలిచిపోతే.. ఈ జీవితమంతా కలలాంటిదే అని అర్థమవుతుంది.

‘నేను’ అంటే ఈ శరీరం కాదని.. ఈ మనోబుద్ధులు కాదని.. వీటన్నిటికీ వేరుగా, ఆకాశంలాగా ఆకారం లేకుండా సర్వవ్యాపకమై ఉన్న చైతన్యస్వరూపం అని.. తెలుస్తుంది. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అందరూ ఆ పరమాత్మ స్వరూపాలేననే గ్రహింపు వస్తుంది. మనిషి అసలు స్వరూపం ఆత్మ అని.. ఇప్పటి రూపం దాని ప్రతిబింబం మాత్రమేనని అర్థమవుతుంది. ఈ విధంగా విచారణ చేసి.. ప్రపంచం మిథ్య అని గ్రహిస్తే ప్రాపంచిక విషయాలకు తపించం. ఇక్కడి సుఖాల కోసం పాకులాడం. ఇక్కడి అనుభవాలను స్వల్పవిషయాలుగా భావించి వాటిని విడిచిపెడతాం. మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతాం. అదే ఆత్మ స్థితి. మోక్ష స్థితి. యోగ స్థితి.