ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ అరుదైన ఘనత

జకర్తా: 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ తేజీందర్‌పాల్ సింగ్ తూర్ అరుదైన ఘనత సాధించాడు. షాట్ పుట్ విభాగంలో అత్యద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకం సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో 20.75 మీటర్ల దూరానికి బంతిని విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా ఇది ఆసియా క్రీడల్లో రికార్డు కావడం విశేషం. ఇది అంతేకాక.. షాట్‌పుట్‌లో, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తేజీందర్‌పాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ.. ట్విట్టర్ వేదికగా అతనిని ప్రత్యేకంగా అభినందించారు.

సమరాన.. యువసేన..!

ఆసియా క్రీడలు: షూటింగ్‌లో మరో రజతం

జకర్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత్‌ మూడో రోజు మూడో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ రోజు ఇప్పటి వరకు దక్కించుకున్న మూడు పతకాలు షూటింగ్‌లోనే కావడం విశేషం.

పురుషుల 50మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ విభాగంలో భారత ఆటగాడు సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. హరియాణాకు చెందిన సంజీవ్‌కు 37 ఏళ్లు. చైనా ఆటగాడు స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 452.7 పాయింట్లతో సంజీవ్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌ ఖాతాలో ఇప్పటి వరకు మొత్తం 8 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.

మొగిలీశ్వరుడిని పూజిస్తే..

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ హరిహర క్షేత్రంగా పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం మొగిలి. మొగిలీశ్వరుడు అక్కడ కొలువైనాడు. భక్తులు తడిబట్టలతో స్నానం చేసి దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తే తప్పకుండా కోర్కెలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.

ఈ ప్రదేశంలోనే కాక దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మొగిలీశ్వరుడి పేరున్న వ్యక్తులు చాలా మంది మనకు కనిపిస్తారు. చుట్టూ కొండల మధ్య కనువిందైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభువుగా ముక్కంటి అక్కడ వెలిశాడని స్థల పురాణాలు చెబుతున్నాయి.

హరితోపాటు కొలువైనందున అది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. గోపాలుడు రుక్మిణీ, సత్యభామ సమేతంగా కొలువై ఉండటం మొగిలి ప్రత్యేకత. దేశంలో ఏ హర క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ భక్తులను పూజారులు శఠగోపంతో ఆశీర్వదిస్తారు. సర్పదోష నివారణ కోసం రాహు కేతు పూజలు చేయించుకునేవాళ్లు ఈ ఆలయంలో చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. పూర్వం మొగలిపొదల సమీపంలో గల మొగిలివారిపల్లి గ్రామంలో పేద బోయ దంపతులు నివసించేవారు.

బోయ భార్య నిండు చూలుతో ఉన్నపుడు ఒకరోజు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు వచ్చి అక్కడే బిడ్డను ప్రసవించింది. మొగలిపొదల వద్ద పుట్టాడు కనుక మొగిలప్ప అని ఆ బిడ్డను అందరూ పిలవసాగారు. మొగిలప్పకి యుక్తవయస్సు వచ్చాక ఒక పెద్ద రైతు ఇంట్లో పశువులను మేపే పనికి కుదిరాడు. ఒకరోజు మొగిలప్ప అడవిలోకి పశువులను తోలుకెళ్లి సమీపంలోని మొగలిపొదల వద్ద వాటిని వదిలి, వంటచెరకు కోసం పొదలను నరకసాగాడు. కొద్దిసేపటికి కంగుమని శబ్దం వచ్చి రక్తం కారసాగింది. ‘

ఆ పొదలను తొలగించి చూడగా అక్కడ రక్తం ధారగా పారుతున్న శివలింగం కనిపించింది. మొగిలప్ప వెంటనే ఆ లింగానికి కట్టుకట్టాడు. అప్పటి నుండి పూలు, పండ్లు సమర్పించి పూజించసాగాడు. ఇంటి ధ్యాస కూడా మరిచిపోవడంతో మొగిలప్ప తల్లి కలవరపడింది.

వెంటనే మొగిలప్పకు వివాహం చేసింది. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. మొగిలప్ప మేపుతున్న గోవులలో ఒకటి పాలివ్వకపోవడంతో రైతు అతడిని మందలించాడు. మరునాడు మొగిలప్ప గోవుపై కన్నేశాడు. మేపుకు వెళ్లినప్పుడు దానిని వెంబడించాడు. దేవరకొండ వైపు వెళ్లి అక్కడ ఉన్న బిలంలో ప్రవేశిస్తుండగా దాని తోకను పట్టుకొన్నాడు. అతనూ గోవుతోపాటు చాలా దూరం ప్రయాణించాడు.

ఇద్దరూ ఒక విశాల ప్రదేశానికి చేరుకోగా అక్కడ జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు పాత్రను చేబూని, ఆ గోవును సమీపించి పాలు పితికింది. మొగిలప్ప అనుమతి లేకుండా ప్రవేశించినందుకు మాత శపించబోయింది. మొగిలప్ప శరణు వేడుకోవడంతో ఆకలిదప్పులు లేకుండా వరం ఇచ్చింది. విషయం ఎవరికైనా చెబితే మరణిస్తావని హెచ్చరించింది. ఆ తర్వాత మొగిలప్ప ఇంటికి చేరుకున్నాడు. నాటి నుండి నిద్రాహారాలు మాని శివధ్యానంలో మునిగిపోయేవాడు. భార్య ఎంత అడిగినా విషయం చెప్పలేదు.

భార్య చివరికి చనిపోతానని బెదిరించడంలో చేసేదేమీ లేక ఊరి పొలిమేరల్లో చితి పేర్చుకొని, ఊరందరినీ పిలిచి విషయం చెప్పాడు. మరుక్షణం మరణించాడు. మొగిలప్ప భార్య పశ్చాత్తాపంతో సహగమనం చేసింది. మొగిలప్ప చితి ఉన్న ప్రదేశాన్ని మొగిలప్ప గుండంగా పిలుస్తుంటారు. మొగిలప్ప పేరుమీదుగానే శివలింగాన్ని మొగిలీశ్వరుడు అని పిలవసాగారు.

సంతానం లేనివారు ఆలయంలో నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కనీసం వంద వరకు వివాహాలు జరుగుతుంటాయి. అమావాస్య నాడు భక్తులు ఆలయంలో పోటెత్తుతారు.

ఆ దేవాలయాల్లోకి పురుషులు ప్రవేశం నిషిద్ధం… వెళితే ఏమౌతుందో తెలుసా?

భారతదేశంలో కొన్ని ప్రఖ్యాత ఆలయాల్లోకి స్త్రీలను అనుమతించరని తెలిసిందే. శబరిమల, శని సిగ్నాపూర్ ఆలయంలోని శని శిల వద్దకు మహిళలను రానివ్వరు. ఈ ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడవటం, కోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన దేశంలో మగవారికి ప్రవేశంలేని దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మ సృష్టికర్త. మనందరి తలరాతలు వ్రాసేది ఈయనే. కానీ బ్రహ్మకు ఎక్కడా గుళ్లు గోపురాలు ఉండవు, పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించరు. అయితే, రాజస్థాన్‌లోని పుష్కర్‍‌లో మాత్రమే బ్రహ్మ ఆలయం ఉంది. కానీ అక్కడ మగవారికి ప్రవేశం లేదు. దానికి కారణం పూర్వం బ్రహ్మ ఓ యజ్ఞం చేశాడట. యాగానికి భార్య పక్కనుండాలి. కానీ సరస్వతీ దేవి రావడం ఆలస్యమవడంతో గాయత్రీ దేవిని వివాహం చేసుకున్నాడట. దానికి కోపించిన సరస్వతీదేవి శాపం పెట్టిందట, అప్పటి నుండి ఆ ఆలయంలోకి స్త్రీలు మాత్రమే ప్రవేశిస్తున్నారు.

కాదని మగవారు వెళితే వైవాహిక జీవితం దెబ్బతింటుందని నమ్మకం. ఇక మగవారికి ప్రవేశం లేని రెండో ఆలయం అట్టుకల్ ఆలయం, తిరువనంతపురం, కేరళ. ఇక్కడ గుడిలో కొలువై ఉన్న కన్నకీ అమ్మవారిని దర్శించుకోవడానికి పురుషులు వెళ్లరు. ఆడవారు మాత్రమే ఆమెను పూజించడం ఆనవాయితీ.

మగవారు ప్రవేశ భాగ్యానికి నోచుకోని మూడవ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి ఆలయం. ఇక్కడ దేవత భగవతీ రూపంలో కొలువై ఉంటుంది. ఈ శక్తి పీఠం వద్ద సతీదేవి వెన్నెముక పడిందంటారు. ఈ మాత సన్యాసానికి అధిదేవత. సన్యాసులు మాత్రం గేటుదాకా వెళ్లి రావచ్చు. ఇతర పురుషులకు అస్సలు అనుమతి లేదు. స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంది.

కేరళలో మగవారు నిషేధింపబడ్డ ఆలయాల్లో మరొకటి చక్కులతుకవు భగవతీ ఆలయం. ఈ ఆలయం అలప్పుజ ప్రాంతంలో వుంది. సంక్రాంతి సమయంలో ఈ ఆలయంలో కూడా స్త్రీలే ప్రత్యేక పూజలు చేస్తారు. నారీ పూజగా చెప్పే ఆ క్రతువులో మొత్తం అంతా ఆడవారిదే ఆధ్వర్యం. అలాగే ధను అనే పేరుతో కూడా చక్కులతుకవు ఆలయంలో సంబరాలు జరుగుతాయి. ఆ సమయంలోనూ ఆడవారు పది రోజుల పాటూ ఉపవాసం చేసి అమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు.

ఇక చివరిగా ఉత్తర భారతదేశంలోని బీహార్‌లో ముజఫర్ పూర్ పట్టణంలో ఉన్న కాళీ మాతా ఆలయంలోకి కూడా ప్రతీ మాసంలోని కొన్ని నిర్దిష్ట సమయాల్లో మగవారు వెళ్లకూడదు. కనీసం పూజారులు కూడా ఆయా రోజుల్లో లోనికి వెళ్లరు. స్త్రీలు మాత్రమే తల్లికి పూజాదికాలు చేస్తారు. మిగతా రోజుల్లో అందరూ వెళ్లవచ్చు.

విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం..

అవతారమూర్తి అయిన శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం. విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాక ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. బ్రహ్మ ప్రతిష్టించిన పంచలింగ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయంలో చెప్పుకోవడానికి చాలా విశిష్టతలు ఉన్నాయి.

ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్థంబాలు ఉన్నాయి. స్వామివారు పడిమటి ముఖంగా వెలసి ఉండటం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. విశాల ప్రాకారాన్ని కలిగిన ఈ క్షేత్రంలో కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు కూడా కనువిందు చేస్తాయి.

ఈ పుణ్యక్షేత్రానికి స్థల పురాణం ఉంది. పూర్వం దేవ దానవులు క్షీర సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద ఆధారం లేకపోవడంతో పర్వతం నిలవలేదు. మదించడానికి వీలుకాలేదు. ఆ సందర్భంలో విష్ణువుని ప్రార్థించగా తాబేలు రూపం ఎత్తి పర్వతానికి ఆధారంగా నిలిచాడు. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు.

పితృ కార్యాలంటే కాశీ గుర్తొస్తుంది. వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్లలేని చాలా మంది ఇక్కడ పితృకార్యాలు చేస్తారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం.

ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ ఆలయం ఉంది.

నాడు దెయ్యాల కొంప.. మరి నేడు..?

ఒకప్పుడు అక్కడ ప్రజలు అడుగు పెట్టాలంటే వణుకు. అక్కడ దెయ్యాలు ఉండేవని స్థానికులు భ్రమపడేవారు. కానీ వందేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌గా మార్చేయడమే. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి అదొక మంచి ప్రదేశంగా మారడమే. ఇలా మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు క్రిష్టినా రోసి తెలిపారు.

1880 కాలంలో ఇక్కడ ప్రజలు నివసించేవారు. వారంతా బంగారం, వెండి తవ్వుకుంటూ జీవనం సాగించేవారు. కానీ 1919 వచ్చేసరికి ఏమైందో ఏమో కానీ జనసంచారం తగ్గి ఎడారిలా మారింది. కారణం అక్కడ ఓ భవనంలో దెయ్యాలున్నాయని ప్రచారం జరగడం. దీంతో ఓ శతాబ్దకాలం మూగబోయినట్లున్న ఆ ఏరియా ఇప్పుడు పర్యాటకులతో నిండిపోయింది. మొత్తం 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో 200 ఎకరాల్లో దాదాపు 12 లాగ్‌ క్యాబిన్లను నిర్మించారు. వాటికి పూర్వీకుల పేర్లు, ఆ ప్రాంత చరిత్రను సూచించేలా పేర్లు పెట్టారు.

ఒక్కోటి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఇంకా అక్కడికి తరలివస్తున్న పర్యాటకులకు ఫిషింగ్‌, హార్స్‌ రైడింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాకపోతే ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఇక్కడ ఒక్కరికి ఒక్క రాత్రికి 630- 2100 డాలర్లు అవుతుంది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు కదూ… కొలరెడోలోని డంటన్‌ హిల్‌స్టేషన్‌ ప్రాంతం.

చరిత్రకు సాక్ష్యం సిప్రస్‌ !

పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో సిప్రస్‌ ఒకటి. టర్కీకి దక్షిణ దిక్కులో, చుట్టూ మధ్యధరా సముద్రాన్ని చుట్టుకొని ఉన్న ఈ దేశం పర్యాటకం మీద ఆధారపడింది. ఇక ఈ దేశాన్ని చూడాలంటే వేసవి సెలవులే ఉత్తమం! ముఖ్యంగా అక్కడి అందమైన సాగరతీరాలే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సిప్రస్‌ దేశానికి కేంద్ర బిందువుగా ఉన్న ఒక చారిత్రక నగరాన్ని కచ్చితంగా చూడాల్సిందే. దీని పేరు ‘న్యూ పఫోస్‌’. క్రీస్తు పూర్వం 58వ సంవత్సరంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని తమ ఆర్థిక రాజధానిగా చేసుకొని పాలించారు. రాజుల సమాధుల కోసం ప్రత్యేకంగా మరో నగరాన్ని నిర్మించారు. దీని పేరు ‘టోంబ్స్‌ ఆఫ్‌ కింగ్స్‌’. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలల్లో ఈ దేశం పర్యాటకానికి అనువుగా ఉంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు: కోరియోన్‌ ఆర్కలాజికల్‌ సైట్‌, సెయింట్‌ హిలేరియన్‌ క్యాసిల్‌.
ఎలా వెళ్లాలి?: భారత్‌ నుంచి సిప్ర్‌సలోని లార్నకా నగరానికి చేరుకోవాలి. ప్రయాణ సమయం సుమారు ఆరు గంటలు.

భగభగలాడే చల్లని దీవి!

అడవుల్లేని దేశం అది. ఏడాదంతా మంచు పరుచుకొని ఉంటుంది. వందలకు పైగా అగ్నిపర్వతాలను తనలో దాచుకొన్న విశిష్టత దీని సొంతం. అందుకే ప్రపంచంలోని అనేకమంది సందర్శకులు చూడటానికి పోటీపడతారు. ఈ దేశం పేరు ఐస్‌ల్యాండ్‌. ఇదొక దీవి. దీన్ని ల్యాండ్‌ ఆఫ్‌ ఫైర్‌, ఐస్‌గా అభివర్ణిస్తారు. అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ దేశానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ప్రతి నాలుగేళ్లకొకసారి బద్దలయ్యే అగ్నిపర్వతాలు నిప్పులు చిమ్ముతూ ఉంటాయి. ఆ భయానక వాతావరణంలో కూడా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ వీక్షించవచ్చు. మరికొంత మంది ఆ అగ్నిపర్వతాల సమీపం వరకూ వెళ్లడానికి కూడా ఉత్సాహం చూపుతారు.
చూడాల్సిన ప్రదేశాలు: బ్లూ లాగూన్‌ (వేడి నీటి సరస్సు), గోల్డెన్‌ సర్కిల్‌ జలపాతం, అక్రుయెరీ పట్టణం
ఎలా వెళ్లాలి: ఐస్‌ల్యాండ్‌కు వెళ్లాలంటే కెఫ్లాఫిక్‌ అంతర్జాతీయ విమానశ్రయానికి మన దేశంలోని ప్రధాన విమానాశ్రయాల నుంచి నేరుగా సర్వీసులు లేవు. యూరోప్‌, ఉత్తర అమెరికాలోని పలు ప్రధాన నగరాల నుంచి కనెక్టింగ్‌ ఫ్లయిట్స్‌ ఉంటాయి. లండన్‌, న్యూయార్క్‌, సీటిల్‌ నగరాలను చేరుకొని అక్కడి నుంచి ఐస్‌ల్యాండ్‌ వెళ్లొచ్చు.

కొత్త కోడలు అత్తింట కుడికాలే ముందు ఎందుకు పెట్టాలంటే?

కొత్తగా వివాహమైన వధువు.. అత్తింటికి వచ్చేటపుడు.. ఇంట్లోకి ముందుగా కుడికాలే పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారం కోడలు కుడికాలే ఎందుకు పెట్టాలనే విషయాన్ని ఇపుడు తెలుసుకుందాం.
 విశ్వంలోని గ్రహాలకు మనిషి శరీరంలోని భాగాలకు ఏదో సంబంధం ఉందని శాస్త్రం చెబుతోంది. శిరస్సుకు సూర్యుడు, ముఖానికి చంద్రుడు, కంఠానికి కుజుడు, శరీరంలోని ఎడమ భాగానికి బుధుడు, కుడి భాగానికి బృహస్పతి, హృదయానికి శుక్రుడు, మోకాళ్లకు శని, పాదాలకు రాహుకేతువులు ప్రాధాన్యం వహిస్తారు.
శరీరంలో కుడి భాగానికి ప్రాధాన్యత వహించే బృహస్పతి సర్వ శుభకారకుడు కావడం వల్ల తొలిసారి అత్తగారింటికి వచ్చే కొత్త కోడలు కుడికాలు గుమ్మంలో పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టడం మంచిదని శాస్త్రం. వివాహం, దాంపత్యం, సంతానం వంటివాటికి బృహస్పతే కారకుడు. ఏ శుభకార్యంలోనైనా కుడి కాలు ముందు మోపడం, కుడి చేత్తోనే పనులు ప్రారంభించడం అనాదిగా వస్తున్న సత్సంప్రదాయం, సర్వామోదం.

పెళ్లయిందా అయితే శుక్రవారం తలస్నానం చేయకండి…

ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తలస్నానం చేసేందుకు ఇష్టపడుతుంది. ముఖ్యంగా.. పెళ్లయిన ఆడవారు మాత్రం ప్రతి రోజూ తలస్నానం చేశాకే వంటగదిలోకి వెళుతుంటారు. అయితే, వివాహమైన వారు తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చేయాలని హిందూ పురాణాలు చెపుతున్నాయి. ఎందుకంటే…
సాధారణంగా శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేస్తుంటారు. శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయరాదు. తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడంతో సమానమన్నమాట. తలకు శాంపులు పెట్టుకోవడం, దీనిని తలంటు అని కూడా అంటారు. రోజూ తలస్నానం చేసే వారికి మాత్రమే వర్తించదు. వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
మంగళవారం, శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు. ఒక వేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌక్యాలన్నీ దూరవుతాయిట. శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంగా, ఎంతో అన్యోన్యంగా ఉంటారట. సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయడం వల్ల దోషం కలుగుతుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఆ రోజులలో మాత్రం తలస్నానం చేయకూడదు.

భార్యకు గౌరవం ఇవ్వట్లేదా?

భార్యను భర్త అనేవాడు గౌరవించాలని పురాణాలు చెప్తున్నాయి. అమ్మకు, భార్యకు జీవితంలో ఉన్నత స్థానమివ్వాలి. నాన్న పుట్టుకకు కారణమైతే.. అన్నదమ్ములు, సోదరీమణులు.. ఓ చెట్టు ఫలాలు వంటి వారు. కానీ భార్య మాత్రం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి ద్వారా ఒక్కటయ్యే మహిళను గౌరవించాలి. వంశం, ఇంటి పేరు, తల్లిదండ్రులు, తోబుట్టువులు అన్నింటిని వదిలి తాళికట్టిన తర్వాత.. చిటికెన వేలు పట్టుకుని భర్త వెంట వచ్చేసిన భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. భార్యను గౌరవించని వ్యక్తి సమాజంలో ఎవరిని గౌరవిస్తాడు.
 భార్యను నవ్వించని, ఆమెను సుఖపెట్టని వ్యక్తి పరలోకంలో పాపుడైపోతాడట. భార్య పేరుతో, భర్త వెంట వచ్చే మహిళ.. అతని వంశం కోసం ఇబ్బంది పడి.. తండ్రి అనే హోదా ఇస్తుంది. అంతేగాకుండా కన్నబిడ్డకే తండ్రిని పరిచయం చేస్తుంది. భర్త కోసం తపిస్తుంది. అలాంటి వ్యక్తిని సంతోషపెట్టకపోవడం, ఈసడింపులకు గురిచేస్తే.. అతను పురుషుడని ఏమాత్రం చెప్పలేరు.
భార్యను ఇంట్లో యంత్రం అనుకుంటే.. ఆమెను శాసిస్తూ పబ్బం గడుపుకునే వ్యక్తిని పురుషుడని ఎలా అంటారు. భర్త కోసం త్యాగశీలిగా మారి.. సర్వాన్ని త్యజిస్తుంది. అలాంటి భార్యను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం, విమర్శించడం వంటివి చేస్తే.. ఏమాత్రం పుణ్యఫలం లభించదు. ఈ తప్పును దిద్దుకోవాలి.. లేకుంటే సర్దుకోవాలి.
జీవితాంతం వెంట నడిచే భార్య మంగళసూత్రం కట్టాక చావోరేవో అన్నీ భర్తే అనుకుని వెంట వచ్చేస్తుంది. స్త్రీ పురుషులంటే పవిత్రమైన కలయిక. అలాంటి స్త్రీని పురుషుడు పరమ ప్రేమతో గౌరవించాలి. భార్య పుణ్యకారకులు. భార్య ఉంటేనే భర్త అనేవాడు యాగం, యజ్ఞం చేయగలడు. అంతేగాకుండా కన్నబిడ్డకు పెళ్లి కూడా చేయగలడు. అదే భార్య లేకుంటే.. ఇలాంటి ఉత్తమ కార్యాలు చేసేందుకు అతడు అనర్హుడు.
అందుకే భార్య ఉంటేనే ఈ లోకంలో సుఖమన్నది లభిస్తుందని, ఆమెను గౌరవించాలని విదురుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తాడు. కంటికి గంతలు కట్టి.. భార్య చూడలేని ఈ లోకాన్ని తానూ ఇకపై చూడబోనని గాంధారి నిర్ణయించడంతో.. ఆమెను నిర్లక్ష్యం చేసిన ధృతరాష్ట్రునికి విదురుడు ఈ నీతిని బోధించాడు.

The Assignment Help Performance

What You Need To Know About Assignment Help out Our essay creating analysts in the united states prepare an essay for individuals at the least highly-priced price tag. It is often somewhat challenging even to find the best people to try and do newspapers on elaborate...

read more

The Ultimate Ucsd Biology Trick

Within those boundaries, we're most likely to encounter those species, Jetz stated. For starters, paramountessays com the proper folding procedure is complex and vitally important. The balloon doesn't enjoy this as it can pop. The cell is the fundamental unit of...

read more

Write down an Essay On-line Tricks

Things You Won't Like About College Level Essay and Things You WillThe Ultimate Approach for College Level EssayAs an example, you may find there are just 3 sub-topics beneath the first topic that you want to talk about so you'll create sub-headings for them. You...

read more

Write down an Essay On-line Tricks

Things You Won't Like About College Level Essay and Things You WillThe Ultimate Approach for College Level EssayAs an example, you may find there are just 3 sub-topics beneath the first topic that you want to talk about so you'll create sub-headings for them. You...

read more

Theoretical Vs Experimental Physics Exposed

Up in Arms About Theoretical Vs Experimental Physics?Take for instance, the notion that the data in a conscious system should be unified. This choice is at the base of the new TRIM input window, together with a Help and an example. From time to time, a simulation or a...

read more
Virtual Board Room – the Conspiracy theory

Virtual Board Room – the Conspiracy theory

Over the last years the data devices comprise one of many areas of analysis in the area of business firm. The environment where businesses develop their actions turns into ever more sophisticated. The developing syndication, the internationalization with the...

read more
దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః అని చెప్పారు. అంటే...

read more