‘సౌత్‌ ఇండియా కన్నా పాకిస్తాన్‌ బెటర్‌’

‘సౌత్‌ ఇండియా కన్నా పాకిస్తాన్‌ బెటర్‌’

పాకిస్తాన్‌పై తనకు ఉన్న ప్రేమను మరోసారి బహిర్గతం చేశాడు మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధూ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకొని విమర్శలు పాలైన విషయం...

read more
‘శబరిమల’ నిరసన హింసాత్మకం

‘శబరిమల’ నిరసన హింసాత్మకం

సుప్రీం తీర్పుపై కొనసాగుతున్న నిరసనలు మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ సుప్రీంను ఆశ్రయించే యోచనలో ‘నిసా’ తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేరళ దేవాదాయ మంత్రి కదంకపల్లి...

read more
జమ్మూ పోలీసుకు ‘శౌర్య చక్ర’

జమ్మూ పోలీసుకు ‘శౌర్య చక్ర’

 ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అశువులు బాసిన పోలీసు కానిస్టేబుల్‌ మన్జూర్‌ అహ్మద్‌ నాయక్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు వరించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉడీ ప్రాంతానికి చెందిన మన్జూర్‌ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా...

read more
దొంగలు కావలెను..

దొంగలు కావలెను..

నెల తిరగ్గానే జీతం.. డైలీ టార్గెట్లు.. అది సాధించకపోతే సాలరీ కటింగ్‌లు.. ఇవన్నీ మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి కామనే.. కానీ ఇవి ‘దొంగ’ ఉద్యోగం కోసం అని చెబితే.. జైపూర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ఇదీ.. కార్పొరేట్‌ కంపెనీలు, మార్కెటింగ్‌ సంస్థలు కల్పించే...

read more
భారీ జీతాలతో దొంగల రిక్రూట్‌మెంట్

భారీ జీతాలతో దొంగల రిక్రూట్‌మెంట్

జైపూర్: సాధారణంగా దొంగలు.. దోచేసిన సొమ్మును పంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న దొంగల నీతి. కానీ ఇక్కడో ఘరానా దొంగ... దొంగతనాలు చేయించడం.. అలా చేసొచ్చినవారికి నెలవారీ జీతాలు ఇస్తూ.. ఓ కంపెనీయే నడుపుతున్నాడు. చిన్నపాటి డాన్‌ను తలపిస్తున్న ఈ ముఠా నాయకుడు ... ఎట్టకేలకు...

read more
ఏ బ్యాంక్‌ ఏటీఎం నుంచి ఎంత డ్రా చేసుకోవచ్చంటే..!

ఏ బ్యాంక్‌ ఏటీఎం నుంచి ఎంత డ్రా చేసుకోవచ్చంటే..!

న్యూదిల్లీ: బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ఇటీవల తన ఖాతాదారులు ఏటీఎంల నుంచి ఒక్క రోజులో డ్రా చేసుకోదగిన మొత్తాన్ని కుదించింది. ఈ నిబంధనలు ఎస్‌బీఐ క్లాసిక్‌ , మాస్ట్రో డెబిట్‌ కార్డులకు వర్తించనున్నాయి. అక్టోబర్‌ 31 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి...

read more
టిట్లీ అప్‌డేట్స్‌ : తుపాను ధాటికి ఎనిమిది మంది మృతి

టిట్లీ అప్‌డేట్స్‌ : తుపాను ధాటికి ఎనిమిది మంది మృతి

సాక్షి,అమరావతి : ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను...

read more
రాఫెల్‌ డీల్‌ వివరాలు కోరిన సుప్రీం

రాఫెల్‌ డీల్‌ వివరాలు కోరిన సుప్రీం

రాఫెల్‌ యుద్ధ విమానాలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారనే వివరాలను అందించాలని సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 29లోగా ఒప్పంద వివరాలను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. యుద్ధవిమానాల ధర,...

read more
మహిళలే నిరసిస్తే ఎలా అయ్యప్పా!

మహిళలే నిరసిస్తే ఎలా అయ్యప్పా!

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు సెప్టెంబర్‌ 28వ తేదీన సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అయ్యప్ప ఆలయంలో మహిళలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామంటూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ అక్టోబర్‌...

read more
సోలిసిటర్‌ జనరల్‌గా తుషార్ మెహతా

సోలిసిటర్‌ జనరల్‌గా తుషార్ మెహతా

భారత సోలిసిటర్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజీత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచి సోలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు ఆయన స్థానంలో తుషార్ మెహతాకి కేంద్రం...

read more

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా..?

పూజగది అనేది ఇల్లు లేదా ఆఫీసులో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ధ్యానం మరియు ప్రశాంతతకు పూజగది కేంద్రం. ఇంట్లో పూజగది ఏ ప్రాంతంలో ఉన్న మంచిదే అని భావిస్తుంటారు. అయితే దీనిని వాస్తుశాస్త్రం ప్రకారం ఉంచినట్లయితే, దీని నుండి భక్తులు శోషించుకునే శక్తి రెట్టింపవుతుంది. పూజగది కొరకు వాస్తు చిట్కాలు పాటించడం వలన గృహం మొత్తంలో ఉండే సానుకూల శక్తిని రెట్టింపు చేయవచ్చును.

గృహానికి ఈశాన్య స్థానం పూజగది నిర్మించడానికి అత్యుత్తమైనది. వాస్తు పురుషుడు తన తల ఈశాన్య దిక్కులో పెట్టి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోనే ప్రతిరోజూ ఉదయం సూర్యకిరణాలను పొందుతుంది. ఇది వాతావరణాన్ని పరిశుద్ధం చేసి రోజంతటికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. అయితే, గృహం యొక్క నిర్మాణం అదేవిధంగా ఇంటి పెద్ద యొక్క పుట్టిన రోజు ఆధారంగా ఈ దిక్కు మారుతుంది. అందుకని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా.. అంటే వాస్తు ప్రకారం, ప్రధాన ద్వారానికి ఎదురుగా పూజగది ఉండరాదు. ఎందుకంటే ఇది పూజగదిలో సృష్టించబడ్డ సానుకూల శక్తిని తగ్గిస్తుంది. పూజగది అనేది మీ ఇంట్లో దేవుని గది.. అందువలన గదిని చీకటిగా ఉంచరాదు. పూజగదిలో చీకటిగా ఉండడం వలన మొత్తం ఇంటి యొక్క స్వస్థత దెబ్బతింటుంది. అందువలన ఈ గదిలో కనీసం ఒక దీపం వెలిగించడం మంగళకరం.

ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పూజగది ఉంచరాదు. ఇది విశ్రాంతి, వినోదం కొరకు ఉపయోగించే ప్రదేశం. అలానే టాయిలెట్ యొక్క వ్యతిరేక శక్తి ఇంట్లో వ్యాపించకుండా నిరోధించడం కొరకు ఈ గదిపైన, దిగువన లేదా ఎదురుగా టాయిలెట్‌ని రూపొందించరాదు.

కొబ్బరికాయ నిలువుగా పగిలితే..

గుడికి వెళ్లినా, పండుగలు చేస్తున్నా దేవున్ని పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రామాయణ, మహాభారతాలలో కూడా టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి.

దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మంది వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురౌతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది.

కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళై వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని సూచన.

టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. చింతించాల్సిన అవసరంలేదంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. పండుగ రోజు దేవుడికి పూలు, టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట. సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట.

ఆత్మవిచారణతోనే యోగ స్థితి

కస్త్వం కో హం కుత ఆయాతః
కామే జననీ కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
పాప, పుణ్య భావాలే లేని యోగి స్థితి మనిషికి రావాలంటే ఏం చేయాలో తెలిపే శ్లోకమిది. శంకర భగవత్పాదులవారి శిష్యులైన యోగానందులవారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. మనిషి ఆత్మానుభూతి చెందాలంటే.. ‘నేను పరమాత్మను’ అనే అనుభూతి కలగాలంటే నిరంతరం ఆత్మ విచారణ చేయాలి. ‘నేనెవరు? నీవెవరు? ఎక్కణ్నుంచి వచ్చాం? ఈ తల్లిదండ్రులెవరు?’ అని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సరైన సమాధానాలు రాబట్టుకోవడమే ఆత్మవిచారణ అని ఈ శ్లోకం భావం. ఆత్మవిచారణ వల్లనే ఆత్మను గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆత్మవిచారణలో భాగంగా వేసుకునే ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా ఎవరో ఒకరు చెబితే రావు. స్వయంగా వెతకాలి. విచారణ చేయాలి. విశ్లేషణ చేయాలి. అందుకు నిర్మలమైన మనోబుద్ధులు కావాలి. అంటే.. ప్రాపంచిక విషయాలలో చిక్కుపడనివి. మన మనసు, బుద్ధి ఈ ప్రపంచంలోని అనిత్యమైన విషయాల మీద, భోగాల మీద నిలిచి కలుషితమైపోయి ఉంటున్నాయి. కనుక ఆ కల్మషాలను ముందు వదిలించాలి. అసలు మన మనసు ప్రాపంచిక విషయాల్లో ఎందుకు చిక్కుబడిపోయిందంటే..

ప్రపంచంపై సరియైున అవగాహన లేకనే. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవడం వల్లనే.. ‘ఇది నిత్యమైనది, సత్యమైనది, దీని ద్వారా మనం ఆనందాన్ని పొందవచ్చు’ అని భ్రమపడతాం. కనుక ముందు ప్రపంచం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి. ఈ విశ్వం ‘స్వప్నవిచారం’ అని పెద్దలు చెబుతున్నారు. అంటే.. కల లాంటిది. స్వప్నం అబద్ధమని మనకు తెలుసు. కలలో లాభం వస్తే.. అది నిజమైనది కాదు గనుక సంతోషించాల్సిన పని లేదు. నష్టం వస్తే చింతించాల్సిన పనీ లేదు. లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, సుఖమైనా.. మెలకువ వచ్చేంతవరకే. మన జీవితమూ అంతే. మనిషి జాగ్రదావస్థలోంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే.. నిజస్వరూపమైన ఆత్మగా నిలిచిపోతే.. ఈ జీవితమంతా కలలాంటిదే అని అర్థమవుతుంది.

‘నేను’ అంటే ఈ శరీరం కాదని.. ఈ మనోబుద్ధులు కాదని.. వీటన్నిటికీ వేరుగా, ఆకాశంలాగా ఆకారం లేకుండా సర్వవ్యాపకమై ఉన్న చైతన్యస్వరూపం అని.. తెలుస్తుంది. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అందరూ ఆ పరమాత్మ స్వరూపాలేననే గ్రహింపు వస్తుంది. మనిషి అసలు స్వరూపం ఆత్మ అని.. ఇప్పటి రూపం దాని ప్రతిబింబం మాత్రమేనని అర్థమవుతుంది. ఈ విధంగా విచారణ చేసి.. ప్రపంచం మిథ్య అని గ్రహిస్తే ప్రాపంచిక విషయాలకు తపించం. ఇక్కడి సుఖాల కోసం పాకులాడం. ఇక్కడి అనుభవాలను స్వల్పవిషయాలుగా భావించి వాటిని విడిచిపెడతాం. మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతాం. అదే ఆత్మ స్థితి. మోక్ష స్థితి. యోగ స్థితి.