గ్రేట్‌ రైటర్‌ విలియం గోల్డింగ్‌

గ్రేట్‌ రైటర్‌ విలియం గోల్డింగ్‌

కరేంజా అంటే ప్రేమ అని అర్థం, కార్నిష్‌ భాషలో. బ్రిటన్‌లో ఒక మైనారిటీ తెగ అయిన కార్నిష్‌ ప్రజల ఈ భాష ఇప్పుడు అంతరించిపోయింది. ఇంగ్లిష్‌ వాళ్లు, బ్రిటిష్‌ వాళ్లకు భిన్నమైన సాంస్కృతిక అస్తిత్వంతో బతికే ఈ కార్నిష్‌ తెగలో జన్మించాడు సర్‌ విలియం గెరాల్డ్‌ గోల్డింగ్‌...

read more
ఔను పొడవే!

ఔను పొడవే!

వీర శతావధానిగా పేరుగాంచిన గాడేపల్లి వీరరాఘవశాస్త్రి (1891–1945) విధివశాత్తూ ప్రథమ కళత్రం గతించగా, ద్వితీయ వివాహం కోసం ప్రయత్నించే సందర్భంలో చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతానికి వెళ్లారు. ఈయన ఆజానుబాహువు, గంభీరమైన విగ్రహం. వధువు పేరు సావిత్రమ్మ. పిడతల...

read more
అన్నంభట్టును ఇవతలకు తెండి!

అన్నంభట్టును ఇవతలకు తెండి!

తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప శాస్త్రకారుడు మాత్రమే కాదు, ఆచారపరుడు కూడా! ఆయన ఆ గ్రంథం మొత్తాన్నీ మడి కట్టుకొనే రచించాడు. ఒకరోజున గ్రంథరచన పూర్తి ఐంది. కవి వివరాలను తెలిపే...

read more
నూరు పదాల కథ

నూరు పదాల కథ

రచయిత జెఫ్రి ఆర్చర్‌ని న్యూయార్క్‌లోని ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ సంపాదకుడు ఒక కథ రాయమని కోరాడు. రాయమని ఊరుకోలేదు. కథకు ఒక మొదలు, ఒక మధ్య భాగం, ఒక ముగింపు ఉండాలనీ; కథలోని పదాలు సరిగ్గా వంద ఉండాలి, 99 కానీ, 101 కానీ ఉండకూడదనీ షరతు విధించాడు. పైగా ఇరవై నాలుగు గంటల్లో...

read more
జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా

జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా

పదం పలికింది – పాట నిలిచింది ఎంత సున్నితమైన గమనింపు చెప్పారన్నదాన్ని బట్టి కదా కవి గొప్పతనం తెలిసేది! సున్నితమైన సంవేదనలు కవిత్వానికి ప్రాణం పోస్తాయి. ఈ పాటకు సి.నారాయణరెడ్డి పోసినట్టు. ‘అక్బర్‌ సలీం అనార్కలి’ చిత్రం కోసం ఆయన రాసిన ‘సిపాయీ సిపాయీ హసీనా హసీనా’ పాట...

read more
టొమాటో బుట్టలో యాపిల్‌ పళ్లుండవు

టొమాటో బుట్టలో యాపిల్‌ పళ్లుండవు

కొత్త బంగారం తాము తప్పు చేస్తున్నామేమో అన్న సంశయం తమ పెళ్ళి రోజునే జాన్, ఐరీన్‌లకు కలుగుతుంది. పెళ్ళి ముందటి రాత్రి, ఇంటి నుంచి పారిపోయేందుకు తనకు సహాయం చేయమని ఐరీన్‌ తన ఆప్తమిత్రురాలైన వాలెరీని అడుగుతుంది. జాన్‌ ధైర్యం కోల్పోయి బార్‌లో కూర్చున్నప్పుడు, అతని...

read more
గ్రేట్‌ రైటర్‌: లూయిజీ పిరాండెల్లో

గ్రేట్‌ రైటర్‌: లూయిజీ పిరాండెల్లో

లూయిజీ పిరాండెల్లో (1867–1936) ఇటాలియన్‌ నాటకకర్త, కవి, కథకుడు, నవలారచయిత. సిసిలీ ద్వీపంలోని సంపన్నుల ఇంట్లో, రాజకీయంగా చైతన్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో కథలు, గాథలు వినడానికి అమిత ఆసక్తి చూపేవాడు. పన్నెండేళ్ల వయసుకే తొలి విషాదాంత నాటకం రాశాడు. తన...

read more
కొంటె కోణంగి రాతలు

కొంటె కోణంగి రాతలు

సాహిత్య మరమరాలు లైబ్రరీ పుస్తకాల మీద కొక్కిరాయిలు రాసే కోణంగి రాతలు ఇలా ఉంటాయి. కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవల పేరు కింద– చదువుతాము సార్‌! అందుకేగా ఇక్కడికి అఘోరించాం. ‘మహాప్రస్థానం’ మధ్యపేజీలో– శ్రీశ్రీ నీ తల ఎండిందోయ్‌ ఎర్రగా! తాతాజీ(తాపీ ధర్మారావు) ‘ఇనప...

read more
రసార్ణవ సుధాకరము

రసార్ణవ సుధాకరము

ప్రతిధ్వనించే పుస్తకం రాచకొండ ప్రభువులు యుద్ధతంత్రంలో ఎంత గొప్పవారో సాహిత్యరంగంలోనూ అంతటి ప్రవీణులు. ‘సర్వజ్ఞ’ బిరుదమున కన్వర్థమైన వారు. వీరిలో సింగభూపాలుడు (1425–75) స్వయంగా రసార్ణవ సుధాకరమనే గొప్ప అలంకార శాస్త్రాన్ని రచించటమే గాక– శార్‌జ్ఞదేవుని సంగీత రత్నాకరానికి...

read more

జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా

పదం పలికింది – పాట నిలిచింది ఎంత సున్నితమైన గమనింపు చెప్పారన్నదాన్ని బట్టి కదా కవి గొప్పతనం తెలిసేది! సున్నితమైన సంవేదనలు కవిత్వానికి ప్రాణం పోస్తాయి. ఈ పాటకు సి.నారాయణరెడ్డి పోసినట్టు. ‘అక్బర్‌ సలీం అనార్కలి’ చిత్రం కోసం ఆయన రాసిన ‘సిపాయీ సిపాయీ హసీనా హసీనా’ పాట...

read more

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా..?

పూజగది అనేది ఇల్లు లేదా ఆఫీసులో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ధ్యానం మరియు ప్రశాంతతకు పూజగది కేంద్రం. ఇంట్లో పూజగది ఏ ప్రాంతంలో ఉన్న మంచిదే అని భావిస్తుంటారు. అయితే దీనిని వాస్తుశాస్త్రం ప్రకారం ఉంచినట్లయితే, దీని నుండి భక్తులు శోషించుకునే శక్తి రెట్టింపవుతుంది. పూజగది కొరకు వాస్తు చిట్కాలు పాటించడం వలన గృహం మొత్తంలో ఉండే సానుకూల శక్తిని రెట్టింపు చేయవచ్చును.

గృహానికి ఈశాన్య స్థానం పూజగది నిర్మించడానికి అత్యుత్తమైనది. వాస్తు పురుషుడు తన తల ఈశాన్య దిక్కులో పెట్టి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోనే ప్రతిరోజూ ఉదయం సూర్యకిరణాలను పొందుతుంది. ఇది వాతావరణాన్ని పరిశుద్ధం చేసి రోజంతటికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. అయితే, గృహం యొక్క నిర్మాణం అదేవిధంగా ఇంటి పెద్ద యొక్క పుట్టిన రోజు ఆధారంగా ఈ దిక్కు మారుతుంది. అందుకని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా.. అంటే వాస్తు ప్రకారం, ప్రధాన ద్వారానికి ఎదురుగా పూజగది ఉండరాదు. ఎందుకంటే ఇది పూజగదిలో సృష్టించబడ్డ సానుకూల శక్తిని తగ్గిస్తుంది. పూజగది అనేది మీ ఇంట్లో దేవుని గది.. అందువలన గదిని చీకటిగా ఉంచరాదు. పూజగదిలో చీకటిగా ఉండడం వలన మొత్తం ఇంటి యొక్క స్వస్థత దెబ్బతింటుంది. అందువలన ఈ గదిలో కనీసం ఒక దీపం వెలిగించడం మంగళకరం.

ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పూజగది ఉంచరాదు. ఇది విశ్రాంతి, వినోదం కొరకు ఉపయోగించే ప్రదేశం. అలానే టాయిలెట్ యొక్క వ్యతిరేక శక్తి ఇంట్లో వ్యాపించకుండా నిరోధించడం కొరకు ఈ గదిపైన, దిగువన లేదా ఎదురుగా టాయిలెట్‌ని రూపొందించరాదు.

కొబ్బరికాయ నిలువుగా పగిలితే..

గుడికి వెళ్లినా, పండుగలు చేస్తున్నా దేవున్ని పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రామాయణ, మహాభారతాలలో కూడా టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి.

దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మంది వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురౌతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది.

కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళై వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని సూచన.

టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. చింతించాల్సిన అవసరంలేదంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. పండుగ రోజు దేవుడికి పూలు, టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట. సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట.

ఆత్మవిచారణతోనే యోగ స్థితి

కస్త్వం కో హం కుత ఆయాతః
కామే జననీ కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
పాప, పుణ్య భావాలే లేని యోగి స్థితి మనిషికి రావాలంటే ఏం చేయాలో తెలిపే శ్లోకమిది. శంకర భగవత్పాదులవారి శిష్యులైన యోగానందులవారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. మనిషి ఆత్మానుభూతి చెందాలంటే.. ‘నేను పరమాత్మను’ అనే అనుభూతి కలగాలంటే నిరంతరం ఆత్మ విచారణ చేయాలి. ‘నేనెవరు? నీవెవరు? ఎక్కణ్నుంచి వచ్చాం? ఈ తల్లిదండ్రులెవరు?’ అని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సరైన సమాధానాలు రాబట్టుకోవడమే ఆత్మవిచారణ అని ఈ శ్లోకం భావం. ఆత్మవిచారణ వల్లనే ఆత్మను గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆత్మవిచారణలో భాగంగా వేసుకునే ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా ఎవరో ఒకరు చెబితే రావు. స్వయంగా వెతకాలి. విచారణ చేయాలి. విశ్లేషణ చేయాలి. అందుకు నిర్మలమైన మనోబుద్ధులు కావాలి. అంటే.. ప్రాపంచిక విషయాలలో చిక్కుపడనివి. మన మనసు, బుద్ధి ఈ ప్రపంచంలోని అనిత్యమైన విషయాల మీద, భోగాల మీద నిలిచి కలుషితమైపోయి ఉంటున్నాయి. కనుక ఆ కల్మషాలను ముందు వదిలించాలి. అసలు మన మనసు ప్రాపంచిక విషయాల్లో ఎందుకు చిక్కుబడిపోయిందంటే..

ప్రపంచంపై సరియైున అవగాహన లేకనే. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవడం వల్లనే.. ‘ఇది నిత్యమైనది, సత్యమైనది, దీని ద్వారా మనం ఆనందాన్ని పొందవచ్చు’ అని భ్రమపడతాం. కనుక ముందు ప్రపంచం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి. ఈ విశ్వం ‘స్వప్నవిచారం’ అని పెద్దలు చెబుతున్నారు. అంటే.. కల లాంటిది. స్వప్నం అబద్ధమని మనకు తెలుసు. కలలో లాభం వస్తే.. అది నిజమైనది కాదు గనుక సంతోషించాల్సిన పని లేదు. నష్టం వస్తే చింతించాల్సిన పనీ లేదు. లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, సుఖమైనా.. మెలకువ వచ్చేంతవరకే. మన జీవితమూ అంతే. మనిషి జాగ్రదావస్థలోంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే.. నిజస్వరూపమైన ఆత్మగా నిలిచిపోతే.. ఈ జీవితమంతా కలలాంటిదే అని అర్థమవుతుంది.

‘నేను’ అంటే ఈ శరీరం కాదని.. ఈ మనోబుద్ధులు కాదని.. వీటన్నిటికీ వేరుగా, ఆకాశంలాగా ఆకారం లేకుండా సర్వవ్యాపకమై ఉన్న చైతన్యస్వరూపం అని.. తెలుస్తుంది. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అందరూ ఆ పరమాత్మ స్వరూపాలేననే గ్రహింపు వస్తుంది. మనిషి అసలు స్వరూపం ఆత్మ అని.. ఇప్పటి రూపం దాని ప్రతిబింబం మాత్రమేనని అర్థమవుతుంది. ఈ విధంగా విచారణ చేసి.. ప్రపంచం మిథ్య అని గ్రహిస్తే ప్రాపంచిక విషయాలకు తపించం. ఇక్కడి సుఖాల కోసం పాకులాడం. ఇక్కడి అనుభవాలను స్వల్పవిషయాలుగా భావించి వాటిని విడిచిపెడతాం. మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతాం. అదే ఆత్మ స్థితి. మోక్ష స్థితి. యోగ స్థితి.