స్వీట్ కార్న్ పాయసం

స్వీట్ కార్న్ పాయసం

కావలసిన పదార్థాలు: కార్న్‌ - 1 పాలు - 2 కప్పులు యాలకుల పొడి - అర స్పూన్ నెయ్యి - అరస్పూన్ పంచదార - 4 స్పూన్స్ పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు - కొద్దిగా కుంకుమ పువ్వు - చిటికెడు. తయారీ విధానం: ముందుగా మిక్సీలో కార్న్‌ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు...

read more
హనీ కేక్

హనీ కేక్

కావలసిన పదార్థాలు: మైదా - 1 కప్పు చక్కెర - 1 కప్పు వెన్న - 100 గ్రా గుడ్లు - 2 పాలు - 3 స్పూన్స్ వెనీలా ఎసెన్స్ - అరస్పూన్ తేనె - అరకప్పు జామ్ - 5 స్పూన్స్ పచ్చికొబ్బరి - 2 స్పూన్స్ తయారీ విధానం: ముందుగా మైదా, చక్కెర, సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను...

read more
ఓట్స్ మంచూరియా..

ఓట్స్ మంచూరియా..

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 2 కప్పులు క్యారెట్, క్యాబేజ్, కీరా - అరకప్పు బీన్స్ - పావుకప్పు ఉల్లిపాయలు - 2 పచ్చిమిర్చి - 5 కొబ్బరి తురుము - పావుకప్పు క్యాప్సికం - పావుకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ - అరచెంచా సోయాసాస్ - అరస్పూన్ టమాటా కెచప్ - 3 స్పూన్స్ అజినోమోటో -...

read more
మసాలా బటర్‌ మిల్క్‌

మసాలా బటర్‌ మిల్క్‌

కావలసినవి: తాజా పెరుగు – 2 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం తురుము – అర టీ స్పూను; ఐస్‌ క్యూబ్స్‌ – తగినన్ని. తయారీ: ​​​​​​​►ఒక పాత్రలో...

read more
సోర్‌ అండ్‌ స్పయిసీ బటర్‌ మిల్క్‌

సోర్‌ అండ్‌ స్పయిసీ బటర్‌ మిల్క్‌

కావలసినవి: తాజా పెరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత ; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మ రసం – 5 టీ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్‌ క్యూబ్స్‌ – తగినన్ని. తయారీ: ►ఒక పాత్రలో పెరుగు వేసి, చిక్కగా గిలకొట్టాలి ►ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి...

read more
పిస్తా కుల్ఫీ

పిస్తా కుల్ఫీ

కావలసినవి: పాలు – 1 లీటరు, పంచదార – 250 గ్రా., బ్రెడ్‌ – ఒక స్లైస్‌ (చివర్లు కట్‌చేసి వైట్‌ది మాత్రమే తీసుకోవాలి), బాదంపప్పు – 20 (నీళ్లలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్‌ చేసుకోవాలి), పిస్తాపప్పు – అర కప్పు (పైన పొట్టు తీసేసి, పలుకులుగా చేసుకోవాలి), ఏలకులు – 4,...

read more
క్యాప్సికం సూప్‌…?

క్యాప్సికం సూప్‌…?

కావలసిన పదార్థాలు: దోరమాగిన టమేటోలు - 6 దోసకాయలు - 2 కొత్తిమీర - 4 కాడలు రెడ్‌ క్యాప్సికం - 1 గ్రీన్‌ క్యాప్సికం - 1 నూనె - 50 గ్రా మిరియాలపొడి - చిటికెడు ఉప్పు- రుచికి సరిపడా. తయారుచేసే విధానం: ముందుగా టమోటో, దోసకాయల తొక్కను, గింజల్ని తీసి చిన్న ముక్కలుగా తరిగి...

read more
పన్నీర్ కట్లీ ఎలా చేయాలంటే..?

పన్నీర్ కట్లీ ఎలా చేయాలంటే..?

క్యారెట్స్ - 30 గ్రా క్యాప్సికం - 30 గ్రా క్యాబేజి - 15 గ్రా బంగాళాదుంపలు - 15 గ్రా నెయ్యి - 20 గ్రా షాజీరా - 3 గ్రా కారం - 5 గ్రా పసుపు - 3 గ్రా జీలకర్ర పొడి - 5 గ్రా గరంమసాలా - 2 గ్రా పన్నీర్ ముక్కలు - కొన్ని బ్రెడ్ పొడి - 50 గ్రా చాట్‌మసాలా - 10 గ్రా ఉప్పు - సరిపడా...

read more
దహీ బల్లా

దహీ బల్లా

కావలసినవి: మినప్పప్పు – అర కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; తాజా పెరుగు – 2 కప్పులు; దానిమ్మ గింజలు – అర కప్పు; గ్రీన్‌ చట్నీ – అర కప్పు; సెనగలు – అర కప్పు (నానబెట్టాలి); బంగాళ దుంప – 1 (పెద్దది); చాట్‌...

read more
మిల్క్ షేక్‌లతో సమ్మర్‌ను షేక్ చేసేయండి…

మిల్క్ షేక్‌లతో సమ్మర్‌ను షేక్ చేసేయండి…

చూస్తుండగానే ఈ ఏడాది సమ్మర్ ముంచుకొచ్చేసింది. ఎండలు భగ్గుమంటున్న వేసవిలో చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజం. అయితే బజార్లో దొరికే కూల్‌డ్రింక్స్, ఐస్‌ క్రీంలు తింటే ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. సరేలే పోనీ పళ్లరసాలు, మిల్క్ షేక్‌లతో అయినా పని కానిద్దామనుకుంటే బయట...

read more

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా..?

పూజగది అనేది ఇల్లు లేదా ఆఫీసులో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ధ్యానం మరియు ప్రశాంతతకు పూజగది కేంద్రం. ఇంట్లో పూజగది ఏ ప్రాంతంలో ఉన్న మంచిదే అని భావిస్తుంటారు. అయితే దీనిని వాస్తుశాస్త్రం ప్రకారం ఉంచినట్లయితే, దీని నుండి భక్తులు శోషించుకునే శక్తి రెట్టింపవుతుంది. పూజగది కొరకు వాస్తు చిట్కాలు పాటించడం వలన గృహం మొత్తంలో ఉండే సానుకూల శక్తిని రెట్టింపు చేయవచ్చును.

గృహానికి ఈశాన్య స్థానం పూజగది నిర్మించడానికి అత్యుత్తమైనది. వాస్తు పురుషుడు తన తల ఈశాన్య దిక్కులో పెట్టి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోనే ప్రతిరోజూ ఉదయం సూర్యకిరణాలను పొందుతుంది. ఇది వాతావరణాన్ని పరిశుద్ధం చేసి రోజంతటికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. అయితే, గృహం యొక్క నిర్మాణం అదేవిధంగా ఇంటి పెద్ద యొక్క పుట్టిన రోజు ఆధారంగా ఈ దిక్కు మారుతుంది. అందుకని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా.. అంటే వాస్తు ప్రకారం, ప్రధాన ద్వారానికి ఎదురుగా పూజగది ఉండరాదు. ఎందుకంటే ఇది పూజగదిలో సృష్టించబడ్డ సానుకూల శక్తిని తగ్గిస్తుంది. పూజగది అనేది మీ ఇంట్లో దేవుని గది.. అందువలన గదిని చీకటిగా ఉంచరాదు. పూజగదిలో చీకటిగా ఉండడం వలన మొత్తం ఇంటి యొక్క స్వస్థత దెబ్బతింటుంది. అందువలన ఈ గదిలో కనీసం ఒక దీపం వెలిగించడం మంగళకరం.

ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పూజగది ఉంచరాదు. ఇది విశ్రాంతి, వినోదం కొరకు ఉపయోగించే ప్రదేశం. అలానే టాయిలెట్ యొక్క వ్యతిరేక శక్తి ఇంట్లో వ్యాపించకుండా నిరోధించడం కొరకు ఈ గదిపైన, దిగువన లేదా ఎదురుగా టాయిలెట్‌ని రూపొందించరాదు.

కొబ్బరికాయ నిలువుగా పగిలితే..

గుడికి వెళ్లినా, పండుగలు చేస్తున్నా దేవున్ని పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రామాయణ, మహాభారతాలలో కూడా టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి.

దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మంది వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురౌతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది.

కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళై వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని సూచన.

టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. చింతించాల్సిన అవసరంలేదంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. పండుగ రోజు దేవుడికి పూలు, టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట. సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట.

ఆత్మవిచారణతోనే యోగ స్థితి

కస్త్వం కో హం కుత ఆయాతః
కామే జననీ కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
పాప, పుణ్య భావాలే లేని యోగి స్థితి మనిషికి రావాలంటే ఏం చేయాలో తెలిపే శ్లోకమిది. శంకర భగవత్పాదులవారి శిష్యులైన యోగానందులవారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. మనిషి ఆత్మానుభూతి చెందాలంటే.. ‘నేను పరమాత్మను’ అనే అనుభూతి కలగాలంటే నిరంతరం ఆత్మ విచారణ చేయాలి. ‘నేనెవరు? నీవెవరు? ఎక్కణ్నుంచి వచ్చాం? ఈ తల్లిదండ్రులెవరు?’ అని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సరైన సమాధానాలు రాబట్టుకోవడమే ఆత్మవిచారణ అని ఈ శ్లోకం భావం. ఆత్మవిచారణ వల్లనే ఆత్మను గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆత్మవిచారణలో భాగంగా వేసుకునే ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా ఎవరో ఒకరు చెబితే రావు. స్వయంగా వెతకాలి. విచారణ చేయాలి. విశ్లేషణ చేయాలి. అందుకు నిర్మలమైన మనోబుద్ధులు కావాలి. అంటే.. ప్రాపంచిక విషయాలలో చిక్కుపడనివి. మన మనసు, బుద్ధి ఈ ప్రపంచంలోని అనిత్యమైన విషయాల మీద, భోగాల మీద నిలిచి కలుషితమైపోయి ఉంటున్నాయి. కనుక ఆ కల్మషాలను ముందు వదిలించాలి. అసలు మన మనసు ప్రాపంచిక విషయాల్లో ఎందుకు చిక్కుబడిపోయిందంటే..

ప్రపంచంపై సరియైున అవగాహన లేకనే. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవడం వల్లనే.. ‘ఇది నిత్యమైనది, సత్యమైనది, దీని ద్వారా మనం ఆనందాన్ని పొందవచ్చు’ అని భ్రమపడతాం. కనుక ముందు ప్రపంచం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి. ఈ విశ్వం ‘స్వప్నవిచారం’ అని పెద్దలు చెబుతున్నారు. అంటే.. కల లాంటిది. స్వప్నం అబద్ధమని మనకు తెలుసు. కలలో లాభం వస్తే.. అది నిజమైనది కాదు గనుక సంతోషించాల్సిన పని లేదు. నష్టం వస్తే చింతించాల్సిన పనీ లేదు. లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, సుఖమైనా.. మెలకువ వచ్చేంతవరకే. మన జీవితమూ అంతే. మనిషి జాగ్రదావస్థలోంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే.. నిజస్వరూపమైన ఆత్మగా నిలిచిపోతే.. ఈ జీవితమంతా కలలాంటిదే అని అర్థమవుతుంది.

‘నేను’ అంటే ఈ శరీరం కాదని.. ఈ మనోబుద్ధులు కాదని.. వీటన్నిటికీ వేరుగా, ఆకాశంలాగా ఆకారం లేకుండా సర్వవ్యాపకమై ఉన్న చైతన్యస్వరూపం అని.. తెలుస్తుంది. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అందరూ ఆ పరమాత్మ స్వరూపాలేననే గ్రహింపు వస్తుంది. మనిషి అసలు స్వరూపం ఆత్మ అని.. ఇప్పటి రూపం దాని ప్రతిబింబం మాత్రమేనని అర్థమవుతుంది. ఈ విధంగా విచారణ చేసి.. ప్రపంచం మిథ్య అని గ్రహిస్తే ప్రాపంచిక విషయాలకు తపించం. ఇక్కడి సుఖాల కోసం పాకులాడం. ఇక్కడి అనుభవాలను స్వల్పవిషయాలుగా భావించి వాటిని విడిచిపెడతాం. మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతాం. అదే ఆత్మ స్థితి. మోక్ష స్థితి. యోగ స్థితి.