కేరళ పేరు వినగాని పర్యాటకానికి మారు పేరు అని గుర్తు వస్తుంది. పచ్చటి ప్రక్రుతి కొబ్బరి తోటలు, తాటి చెట్లతో నిండుగా కనిపించే బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, మంచి నీటి సరస్సులు, నదులు, కాలవలు మొదలగు ఆకర్షణల మద్య అద్భుతంగా ఉండే ఈ ప్రదేశానికి టూర్ వెళ్ళడం అంటే అత్యంత ఆహ్లాదకరమైనది ప్రదేశాన్ని సందర్శించడమే.

కేరళలో బీచ్ లు, బ్యాక్ వాటర్స్ పర్వత ప్రదేశాలు సెలవుల్లో విశ్రాంతి పొందాలనుకునే వారికి ఇది ఒక స్వర్గ దామం వంటింది. ట్రెక్కింగ్ , బోటింగ్, ఆధ్యాత్మిక జీవనం గడపాలనుకునే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అలాగే కొత్తగా పెళ్లైన జంటలకు , రసమయ జీవితంలో ఓలలాడాలనుకే జంటలకు కేరళ ఒక మజిలీ అని చెప్పవచ్చు.

ముఖ్యంగా కేరళలో ప్రతి సంవత్సరం సాంప్రదాయ స్నేక్ బోట్ రేస్ జరగడం విశేషం. ఇది చూడటానికి కేరళ రాష్ట్రుయులు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకలు ఈ సమయంలో సందర్శిస్తుంటారు. ముఖ్యంగా కేరళ ప్రక్రుతి ఒడిలో తుళుతూళుతు ఉండే సరస్సులు కేరళను మరింత అందంగా చూపించి పర్యాటకులను ఆకర్షిస్తాయి. కేరళలో ఉండే వెంబనాడు సరస్సు ఇండియాలో ఉండే సరస్సులలో కంటే అతి పెద్ద సరస్సుగా చెబుతారు. అంతే కాదు కేరళ హిల్ స్టేషన్స్ కు ప్రసిద్ది.

భారత దేశంలో కేరళ సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది. కేరళీయుల దుస్తులు, కళలు, ఆహారాలు మొదలైనవి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కేరళకు చెందిన కథాకళి, మోహిని అట్టం ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. ఇంతటి ప్రసిద్ది చెందిన కేరళ పర్యటనకు తప్పక వెళ్లాల్సిందే. అయితే వెళ్ళే ముందు కేరళలో చూడదగ్గ ఇతర అద్భుత ప్రదేశాలను కూడా ఒక పట్టిక తయారుచేసుకుని మీకున్నంత సమయంలో తప్పనిసరిగా ఈ క్రింది ప్రదేశాలను కూడా చూసి రండి..మరి ఆ అద్భుతమైన ప్రదేశాలేంటో తెలుసుకుందాం..

అలెప్పె:
కేరళ రాష్ట్రంలో 6వ అతి పెద్ద పట్టణం, లైట్ హౌస్ కు ప్రసిద్ది. అలెప్పిలో ఉప్పునీటి సరస్సులు, బీచ్ లకు ప్రసిద్ది. ఇవి ఒక రమణీయ అనుభూతిని కలిగిస్తాయి. బీచ్ లతో పాటు హౌస్ బోటింగ్ లు ముఖ్య ఆకర్షణలు. అందుకే కేరళలో రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటిగా ప్రసిద్ది చెందినది

కొచ్చి:
ఎర్నాకులం జిల్లాలో అతి పెద్ద నగరం. రేవుపట్టణం కూడా. ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం. అరేబియన్ సముద్రాన్ని తన శరీరంలో భాగంగా చేసుకున్న అద్భుతమైన నగరం. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకుల మదిని దోచే మజిలి కొచ్చి. ఎంతో మంది పోర్చుగీసు వారు కొచ్చిలో స్థిరపడ్డారు. ప్రపంచపు మహోన్నత సంస్కృతుల మేళవింపు కొచ్చి. ఆహార పదార్ధాల వ్యాపారానికి, ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు మరియు మూలికల వ్యాపారంలో ఈ పట్టణం పేరొందింది. కొచ్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, మ్యూజియం ఆఫ్ కేరళ హిస్టర్, సెయింట్ మేరీ కేథడ్రాల్ బసిలికా, మట్టన్చేరి పాలస్, సుభాష్ పార్క్ ప్రసిద్ది.

మున్నార్:
కేరళలో ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్ హిల్ స్టేషన్ కు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. మున్నార్ మూడు నదులు కలిసే ప్రేదేశంలో కలదు. ఇది ప్రసిద్ద పర్యాటక ప్రదేశం కావటం వల్ల ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మన దేశం నుండే కాదు, ఇతర విదేశాల నుండి కూడా లక్షలాది పర్యాటకులు పిక్న్ లు , వీకెండ్ డెస్టినేషన్, సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి తనివితీరా విశ్రాంతి పొందడానికి ఇక్కడికి వస్తుంటారు.

తెక్కాడి:

ఆధ్యాత్మిక చింతననీ, ప్రకృతి సోయగాన్ని ఏకకాలంలో ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రదేశం ఒక అద్భుతమైన ప్రదేశం. వెకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఉత్తమమైనది. తెక్కడిని భూలోక స్వర్గమనే చెప్పాలి. కేరళలోని కొచ్చికి 180కిమీ దూరంలో కొట్టాయం రైల్వే స్టేషన్ కు 114కిలోమీటర్ల దూరంలో ఉన్న తెక్కడి ప్రాంతం వన్యప్రాణులకు ప్రసిద్ది. ఆనందం ఆహ్లాదం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా తెక్కడి అందచందాలను వీక్షించాల్సిందే