శరీరంలో చేరిన అనవసరమైన కొవ్వును కరిగించడానికి ఆండ్రాయిడ్‌, ఓఎస్‌ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఫిట్‌నెస్‌ యాప్స్‌ విశేషాలివి…
సెవెన్‌ మినిట్‌ వర్కవుట్‌
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఈ బిజీ షెడ్యూల్‌లో వ్యాయామానికి ఖాళీ ఎక్కడిది అని ప్రశ్నించే వాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ యాప్‌. కనీసం ఉదయం ఏడు నిమిషాలు కేటాయిస్తే చాలు… మిమ్మల్ని ఫిట్‌ చేయడానికి ఓ యాప్‌ రెడీగా ఉంది. అదే ‘సెవెన్‌ మినిట్‌ వర్కవుట్‌’. ఇందులో వర్కవుట్‌ ఎలా చేయాలో అన్ని వివరాలతో పాటు డెమో వీడియోలూ ఉంటాయి.
స్క్వాట్స్‌
వ్యాయామం చేస్తున్నారు సరే… ఎలాంటి డైట్‌ తీసుకోవాలి? డైట్‌ గురించి తెలియకపోతే కసరత్తులకు ఫలితం ఉండదు. దీనికోసం ‘స్క్వాట్స్‌’ అనే యాప్‌ ఉంది. ఇందులోకి లాగిన్‌ అయి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేస్తే దానికి తగ్గ ఫిట్‌నెస్‌ ప్లాన్‌ను చెబుతుందీ యాప్‌.
మై ఫిట్‌నెస్‌ పాల్‌
ఎటువంటి ఆహారం తింటే ఎన్ని క్యాలరీలు శరీరంలోకి వెళతాయో, ఏ వ్యాయామం చేస్తే అవి ఖర్చవుతాయో తెలియాలంటే మీ ఫోన్‌లో ఫిట్‌నెస్‌ పాల్‌ ఉండాల్సిందే. అంతే కాదు మీరు కొన్న ఆహారం ప్యాకెట్‌ మీద ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు…కార్బొహైడ్రేట్స్‌, ప్రొటీన్లు, కొవ్వు శాతాలు ఆ ఆహారంలో ఎంత ఉన్నాయో చెబుతుంది.
ట్రైఫెక్టా
క్రాస్‌ఫిట్‌ ట్రైనింగ్‌ తీసుకునేవారికి ఈ యాప్‌ బెస్ట్‌ ఆప్షన్‌. క్రాస్‌ఫిట్‌ ట్రైనింగ్‌కీ, సాధారణ వ్యాయామానికి చాలా తేడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా శిక్షణకు ఎంతో డిమాండ్‌ పెరుగుతోంది.