సంవత్సరంలో ఒక్కసారైనా షిరిడీ దర్శించాలని కోరుకునే పర్యాటకులెందరో. ఎందుకంటే సాయినాధునిపై ఉండే భక్తిభావం, శిరిడి ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. షిరిడీ దర్శించే వారు మార్గంలో నాసిక్ మరో మజిలీ. గ్రేప్ సిటిగా ప్రసిద్ది చెందిన నాసిక్ లో ఒక వైపు గోదావరి నదీ జలాల గలగలలు వినిపిస్తాయి. మరో వైపు నోరూరిస్తూ ద్రాక్షతోటలు విస్తారంగా కనబడుతాయి.

మహారాష్ట్రలో ఉన్న షిరిడి నుండి 86 కిలో మీటర్ల దూరంలో ఉండే నాసిక్ నగర ప్రకృతి సంపదకు లోటు ఉండదు. నేపా వ్యాలీ పడమటి కనుమలలో కలదు. నాసిక్ మొదటిలో శాతవాహన రాజుల రాజధానికిగా ఉండేది. మొఘల్ చక్రవర్తుల పాలనలో గుల్షనాబాద్ గా పేరొందిన ఈ నగరం..చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక వైభవం కలిగి ఉంది. అంతే కాదు, నాసిక్ కు రామాయణంకు చాలా దగ్గరి సంబంధం ఉంది. రామాయణంలో ప్రస్తావించిన కొన్ని తాలు నాసిక్ లో ఉన్నట్లు పురాణాలు తెపుతున్నాయి. మరి ఆ పురాణగాథ ఏంటో ఆప్రదేశాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాలు
నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాలు రామాయణ గాథతో ముడిపడి ఉన్నాయి. శ్రీరాముడు 14సంవత్సరాలు అరణ్య వాసం చేసింది నాసిక్ లోని తపోవనంలోనే. ఈ ప్రదేశంలోనే లక్ష్ముణుడు..శూర్పణఖ ముక్కు చెవులు కోశాడనీ అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరువచ్చింది.

నాసిక్ లో పంచవటి ప్రముఖ పర్యాటక ప్రదేశం
నాసిక్ లో పంచవటి ప్రముఖ పర్యాటక ప్రదేశం. పాండవులు వనవాస కాలంలో సీతారామలక్ష్ముణులు ఇక్కడే ఉన్నారని స్థల పురాణం ఉంది. కాబట్టి రామాయణంలో పేర్కొనబడిన సీతా గుఫ చూసేందుకు పంచవటి తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి.
గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి. ఒడ్డున ఉన్న సీతాగుఫా(గుహ) ప్రాంతంలోనే రావణుడు సీతమ్మను అపహరించాడని చెబుతారు. ఈ ప్రదేశాలు నిత్యం యాత్రికులతో సందడిగా ఉంటుంది.

17వ శతాబ్దంలో నిర్మించిన కాలారామ్
17వ శతాబ్దంలో నిర్మించిన కాలారామ్ ఆలయంలో అనువణువునా అద్భుతమైన శిల్పకళ అలరిస్తుంది. పట్టణంలోని ముక్తిధామ్ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించారు.

ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ
ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ చెక్కడం విశేషం. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో పాండవ గుహలుంటాయి. వీటిలో బౌద్దం, జౌనమతాలకు చెందిన శిల్పాలను చూడొచ్చు.