తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచడం వల్ల వచ్చే నొప్పి మైగ్రేన్‌. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. మానసిక అశాంతి, అధిక నిద్ర, ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు ఎన్ని మందులు వాడినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతతతోనే అదుపులో పెట్టుకోవచ్చు. తాజాగా, మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించే ఇన్‌హేలర్‌ను డెన్మార్క్‌లోని ఆరస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇన్‌హేలర్‌ను పీల్చినపుడు దానిలో ఉండే సమ్మేళనాలు.. మెదడుకు వెళ్లే రక్తనాళాలను పెద్దవిగా చేసి, ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరుస్తాయట. దాంతో మెదడుకు కావాల్సినంత రక్తం, ఆక్సిజన్‌ అంది నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట.