పగటి పూట నిద్ర మంచిదా? కాదా? ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఎక్కువ సేపు నిద్రపోతే ప్రమాదమేనన్నది కొందరు పరిశోధకుల మాట. అయితే, పగటి పూట ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, పని చేసే ముందు కాసేపు కునుకు తీస్తే మెదడు చురుగ్గా ఉంటుందని వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులు తెలిపారు. కునుకు వల్ల పనిలో ఏకాగ్రత వస్తుందని వెల్లడించారు.