రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే… విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో విశేష సేవలందించిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డులను ప్రదానం చేసింది. అందులో ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ పవర్ ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అవార్డు అందుకున్నారు.