ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ సీఈవో, డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘురాం 2017 సంవత్సరపు ప్రతిష్ఠాత్మక ‘సామాజిక సేవా పురస్కారాన్ని’ దక్కించుకున్నారు. ది అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా అందించే ఈ అవార్డును జైపూర్‌లోని బీఎమ్‌ బిర్లా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో జరిగిన ఏఎ్‌సఐసీఓఎన్‌ 77వ వార్షిక సదస్సులో రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్‌ జైన్‌ రఘురాంకు ప్రదానం చేశారు. దేశసేవ, సామాజిక సేవ చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. కాగా, సామాజిక సేవా పురస్కారాన్ని అందుకున్న పిన్న వయస్కుడు రఘురాం కావడం విశేషం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఈయనే.