మాస్టర్‌ యల్లమిల్లి జొనార్దన్‌ 5 ఏళ్ళ అతి చిన్న వయస్సులో అపారమైన జ్ఙాపకశక్తితో అందరినీ అబ్బురపరిచి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. శనివారం లాలాపేట్‌లోని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ప్రధాన కార్యాలయంలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.చింతపట్ల వెంకటాచారి అవార్డును, సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ చిన్న వయస్సులో అపారమైన జ్ఙాపకశక్తితో బైబిల్‌ వివరాలు, భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానులు, జాతీయ చిహ్నలు, స్వాతంత్ర సమరయోధులు, శాస్త్రజ్ఙులు, రచయితల పేర్లు చెప్పినందుకుగానూ సూపర్‌ కిడ్‌ విభాగంలో అరుదైన రికార్డుగా భావించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం కల్పించానని తెలిపారు.