టర్కీ పేరు విన్నగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్‌. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ అనేక సినిమాల్లో ఈ నగర అందాలు కనువిందు చేశాయి. అంతెందుకు రెండేళ్ల క్రితం వచ్చిన బాండ్‌ చిత్రం ‘స్కైఫాల్‌’ ఓపెనింగ్‌ సన్నివేశంలోనూ కనిపిస్తుందీ నగరం. ముఖ్యంగా ‘పాముక్కలే’ అనే పల్లె అయితే టూరిస్టులకు తెగ ఇష్టం. అక్కడ మీకు ‘ఽథర్మల్‌ పూల్స్‌’ ‘వేడి నీటి సరస్సులు) దర్శనమిస్తాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఆ దేశాన్ని పాలించిన రోమన్ల కాలం నుంచీ ఈ ‘పాముక్కలే’ సహజసిద్ధమైన స్పాగా ప్రసిద్ధి. ఈ పల్లెకు సమీపంలో ఉన్న ‘హీరాపోలిస్‌’ అనే నగరానికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందుకే హీరాపొలిస్‌- పాముక్కలే’లను యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అందుకే ‘చర్చ్‌ ఆఫ్‌ హోలీ విజ్‌డమ్‌’గా పేరొందిన ‘హేగియా సోఫియా’ మ్యూజియం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని నిర్మాణం క్రైస్తవం- ఇస్లాం సంస్కృతులను ప్రతిబింబించేలా ఉంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు: సుల్తాన్‌ అహ్మద్‌ మసీదు, గ్రాండ్‌ బజార్‌, గొరెమ్‌ పట్టణం
ఎలా వెళ్లాలి: భారత్‌ నుంచి నేరుగా ఇస్తాంబుల్‌కు విమాన సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి సుమారు 11 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక న్యూఢిల్లీ, ముంబయిల నుంచి కేవలం ఆరు గంటల్లో ఇస్తాంబుల్‌ చేరుకోవచ్చు.