మంచి విషయాలు నేర్చుకోవాలంటే…

మంచి విషయాలు నేర్చుకోవాలంటే…

ఒకే తరగతి పిల్లలే కావొచ్చు... అయినప్పటికీ వారి గ్రహణశక్తిలో, జ్ఞాపకశక్తిలో ఒక్కొక్కరి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఒకే తరగతి పిల్లలయినా వారి వారి తల్లిదండ్రుల స్థాయీ, అంతస్తుల్లో అంతరం ఉండవచ్చు. వాళ్లల్లో కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు ఉండవచ్చు. ఇంటర్‌తోనో,...

read more
స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలా మంది చేసే తప్పు ఇదే..!

స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలా మంది చేసే తప్పు ఇదే..!

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్‌ వినియోగమూ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎన్నో అవసరాలను ఇంటర్నెట్‌ తీరుస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉండే ప్యాకేజీలను సర్వీస్‌ ప్రొవైడర్లు అందిస్తున్నారు. అయితే మన ఫోన్‌లో మనకు తెలియకుండానే కొంత ఇంటర్నెట్‌ వినియోగం...

read more
తిరిగి ఇచ్చేద్దాం..  ప్రకృతికి ప్రేమతో!

తిరిగి ఇచ్చేద్దాం.. ప్రకృతికి ప్రేమతో!

ప్రకృతి మనకు చాలానే ఇస్తోంది.. ఎంతో కొంత మనమూ తిరిగి ఇచ్చేయాలి... లేకుంటే... బతుకే భారం అవుతుంది. చిక్కి సగమైపోతాం! అందుకు కనిపిస్తున్న ఫొటోనే సాక్ష్యం.. ‘మొన్నీ మధ్యే ఎక్కడో చూశాం!’ అనుకుంటున్నారా? కరెక్టే... కేరళలో. సభ్య సమాజానికి ప్రకృతి పంపిన పిక్చర్‌ మెసేజ్‌ అది...

read more
సంస్థ కోసం…  బంగారం కూడా అమ్మేశా!

సంస్థ కోసం… బంగారం కూడా అమ్మేశా!

చదివిన రంగంలోనే ఉద్యోగం చేయాలా...అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు రిస్క్‌ చేయలేరా... టెక్నాలజీ రంగంలో ఆడపిల్లలు ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమా...ఇవన్నీ హైదరాబాద్‌కి చెందిన మానసా మడపుని అడిగితే...అవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో ఎన్నో...

read more
యువతకు సోషల్‌ మీడియా రుగ్మత..

యువతకు సోషల్‌ మీడియా రుగ్మత..

మానసిక సమస్యలకు వైద్య చికిత్సను ఆశ్రయించకుండా సోషల్‌ మీడియా సైట్లు యువతను తప్పుదారిపట్టిస్తున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. 14 నుంచి 30 ఏళ్ల లోపు యువత తమ మానసిక రుగ్మతల పరిష్కారానికి వైద్య చికిత్సకు వెళ్లకుండా సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారని అథ్యయనం చేపట్టిన...

read more
రూపు రూపం మారింది!

రూపు రూపం మారింది!

పూజలకు తగినట్లుగా దుస్తులూ వాటికి జతయ్యే నగల్ని ఎంచుకోవడం ఈ శ్రావణమాసంలో చాలామంది చేసేదే. దానికితోడు కచ్చితంగా ఓ రూపు కొనుక్కోవడం కూడా ఎన్నో ఇళ్లల్లో ఉన్న ఆనవాయితే. పూజలయ్యాక ఆ రూపుల్ని నల్లపూసలు లేదా మంగళసూత్రాల్లో వేసుకోవడం కూడా తెలిసిందే. ఇప్పుడా ట్రెండ్‌ మారింది....

read more
మీకంటూ ఓ స్టైల్‌!

మీకంటూ ఓ స్టైల్‌!

నుగుణంగా వచ్చే ట్రెండ్‌లకు తగ్గట్లే తమని తాము అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటారు కొందరు. కానీ వాటిపై ప్రయోగాలు చేయడానికి మాత్రం భయపడుతుంటారు. ఏ ఇబ్బందీ లేకుండా ఆ మార్పులు ఎలా చేసుకోవాలంటే...! *ఫ్యాషన్‌ అంటే మార్కెట్‌లోకి వచ్చిన ప్రతిదాన్నీ అనుకరించడం కాదు. పైగా ఎవరికో...

read more
గూగుల్‌ మెచ్చిన తెలుగోడు

గూగుల్‌ మెచ్చిన తెలుగోడు

అతడి మెదడు పాదరసంలా పరుగెడుతుంది. సృజన రెక్కలు తొడుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం... ఏదో సాధించాలనే తపన... ఇవే బీటెక్‌ విద్యార్థి హర్షతేజకి ‘గూగుల్‌ ఐఓ సదస్సు’ ఆహ్వానం అందేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు భారత్‌ నుంచి ఎంపికైన...

read more

మద్యంతో ఈ రిస్క్‌ అధికం

మద్యం తరచూ సేవిస్తే డీఎన్‌ఏ దెబ్బతిని క్యాన్సర్‌ సోకే రిస్క్‌ అధికమవుతుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆధ్వర్యంలో సాగిన ఓ అథ్యయనం హెచ్చరించింది. మద్యంతో క్యాన్సర్‌ ముప్పుపై గతంలో పలు పరిశోధనలు వెల్లడించినా, మద్యం కారణంగా మానవ డీఎన్‌ఏకు శాశ్వతంగా ఎంతటి నష్టం...

read more

ప్రమాదంలో పడ్డ పిల్ల ఏనుగును భుజాలపై మోసి..

బాహుబలి-2 సినిమా ప్రారంభ సన్నివేశం గుర్తుంది కదా.. మదమెక్కిన ఏనుగును బాహుబలి మచ్చిక చేసుకునే తీరు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇంచుమించు అలాంటి ఫీట్‌తోనే ఓ సాధారణ యువకుడు ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయాడు. అవును.. తమిళనాడుకు చెందిన పి శరత్‌కుమార్ (28) ఒక్కసారిగా...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.