మహిళల్లో నిద్రలేమికి…

మహిళల్లో నిద్రలేమికి…

నిద్రలేమి అనగానే ఎవరికైనా, వెంటనే గుర్తుకు వచ్చేవి నిద్రమాత్రలే. ప్రత్యేకించి మహిళల్లో ఈ సమస్య మరికాస్త ఎక్కుకే కాబట్టి. వెంటనే నిద్ర మాత్రలు తెచ్చేసుకునే ప్రయత్నమే చేస్తారు. అంతేగానీ, నిద్ర పట్టకసోవడానికి గల అసలు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నమైతే చాలా మంది చేయరు....

read more
బాడీ లాంగ్వేజ్‌ బాగుంటేనే..!

బాడీ లాంగ్వేజ్‌ బాగుంటేనే..!

ఎదుటి వారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్‌ మీద ఆధారపడి ఉంటుంది. నిలబడే తీరు, ముఖంలో ఒలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. అలాంటి కొన్ని ట్రిక్స్‌ మీకోసం! పోశ్చర్‌: నడిచేటప్పుడు భుజాలు వెనక్కి, చుబుకం పైకి ఉండాలి. నిటారుగా ఉండాలి. శరీరం...

read more
డబ్బు లెక్క మంచిదే!

డబ్బు లెక్క మంచిదే!

ఇంటిని చక్కదిద్దే మహిళలకు... డబ్బును లెక్కప్రకారం ఖర్చుచేయడం, పొదుపు చేయడం ఎలాగో తెలియడం కూడా ఎంతో ముఖ్యం. డబ్బు నిర్వహణ మీద అవగాహన పెంచుకుంటే ఆర్థికంగా ఎదురయ్యే ఒడుదొడుకులను తట్టుకోవడం సులభమవుతుంది. అదెలాగంటే... తక్కువ ఖర్చు: సంపాదన కన్నా ఖర్చు తక్కువ ఉండేలా...

read more
కూతుర్ని కనాలి

కూతుర్ని కనాలి

పెళ్లయి వెళ్లిపోతే కూతురు పరాయి ఇంటి పిల్లే అని తల్లితండ్రుల ఆలోచన. కూతురుంటే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే చాలని అనుకుంటారు. అదే కొడుకు పుడితే వంశ వృద్ధి అని, పున్నామనరకం దాటిస్తాడనీ నమ్మకం. అయితే, కూతురే కొడుకై పున్నామ నరకం దాటించడానికి ముందుకు వస్తే..! నల్లగొండకి...

read more
కన్యాదానం ఏంటీ?

కన్యాదానం ఏంటీ?

భారతదేశంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు భిన్నంగా, ఒక మహిళ పౌరోహిత్యం వహించి, కన్యాదానం లేకుండా వివాహం జరిపించింది. ‘‘పితృస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, మహిళ ప్రాధాన్యతను తెలియచేయాలనుకున్నాను’’ అంటారు నందిని భౌమిక్‌. అన్విత జనార్దన్, అర్క...

read more
ప్రశాంతంగా ఆలోచించడం.. ప్రతి మనిషికి అవసరం…?

ప్రశాంతంగా ఆలోచించడం.. ప్రతి మనిషికి అవసరం…?

మొదటి అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళా దినోత్సవంగా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 తేదీన ఆచరిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించి సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది....

read more
కేరళ సైంటిస్ట్‌కు నారీశక్తి అవార్డు..

కేరళ సైంటిస్ట్‌కు నారీశక్తి అవార్డు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ సైంటిస్ట్ నారీ శక్తి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రాను కనుగొన్న ఆమెకు ఈ అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే.. కేరళ సైంటిస్ట్ డాక్టర్. ఎ. సీమా ఈ అవార్డును తన ఖాతాలో...

read more
శుభ్రం చేస్తున్నారా?

శుభ్రం చేస్తున్నారా?

మేకప్‌ వేసుకున్న తర్వాత అందుకు వాడిన బ్రష్‌లు, స్పాంజ్‌ల గురించి మర్చిపోతాం! కానీ స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే వాటిని క్రమం తప్పక శుభ్రం చేస్తూ ఉండాలి. ఎప్పుడంటే? ఫౌండేషన్‌, కన్‌సీలర్‌ బ్రష్‌లు వారానికోసారి శుభ్రం చేయాలి. కంటి చుట్టూ మేకప్‌ కోసం వాడే...

read more
గర్భిణులు అందాన్ని కోల్పోతున్నారా.. అయితే..?

గర్భిణులు అందాన్ని కోల్పోతున్నారా.. అయితే..?

గర్భిణీ స్త్రీలు అందంగా కనిపించాలని అనుకుంటారు. కానీ, కొన్ని కారణాలు వలన అందాన్ని కోల్పోతుంటారు. ముఖచర్మం బాగా మెరవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేస్తే చర్మం బాగా మెరుస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగవడం వలన శరీరంలోని విష పదార్థాలు...

read more
చేయగలిగిన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి…

చేయగలిగిన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి…

అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని సాధించలేకపోయామని బాధపడేకంటే జీవితంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పర్చుకోవడమే చీకూ చింతాలేని, ఆరోగ్యకరమైన ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఆచరణయోగ్యమైన లక్ష్యాలను ఏర్పర్చుకున్న వారే...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.