షియోమీ ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2 విక్రయం ప్రారంభం

షియోమీ ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2 విక్రయం ప్రారంభం

మొబైల్ తయారీదారు షియోమీ సంస్థ త‌న ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2ను భార‌త మార్కెట్‌లో మంగళవారం నుంచి విక్రయించనుంది. ఈ షూస్ వినియోగ‌దారుల‌కు రూ.2,999 ధరతో ల‌భిస్తున్నాయి. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ షూస్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. కాగా ఈ షూస్‌ను 5 భిన్న‌మైన మెటీరియ‌ల్స్‌తో త‌యారు...

read more
వచ్చే వారంలో విడుదల కానున్న ఒప్పో ఎ5ఎస్ స్మార్ట్‌ఫోన్

వచ్చే వారంలో విడుదల కానున్న ఒప్పో ఎ5ఎస్ స్మార్ట్‌ఫోన్

మొబైల్ తయారీదారు సంస్థ ఒప్పో వచ్చే వారం భారత మార్కెట్‌లోకి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5ఎస్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ రూ.10 వేల ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరిచారు. ఒప్పో ఎ5ఎస్ ప్రత్యేకతలు: * 6.2 అంగుళాల హెచ్‌డీ...

read more
మరోసారి ఆఫర్లతో ముందుకొస్తున్న షియోమీ

మరోసారి ఆఫర్లతో ముందుకొస్తున్న షియోమీ

చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్' పేరుతో మరోమారు ఆఫర్ల వాన కురిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌ ఆఫర్‌లో పోకో ఎఫ్1, రెడ్‌మీ నోట్ 6 ప్రొ తదితర స్మార్ట్‌ఫోన్లతోపాటు ఎంఐ...

read more
ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన నోకియా ఎక్స్71

ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన నోకియా ఎక్స్71

ప్రపంచ మొబైల్ మార్కెట్‌లోకి హెచ్ఎండీ గ్లోబ‌ల్ తాజాగా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్‌71ను తైవాన్‌ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈనెల 10వ తేదీ నుండి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. దీని ధర రూ.26,875గా నిర్ణయించారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను...

read more
జర్మనీలో అమేజాన్‌కు ఆంక్షలు.. గూగుల్ తరహాలో..?

జర్మనీలో అమేజాన్‌కు ఆంక్షలు.. గూగుల్ తరహాలో..?

జర్మనీలో అమేజాన్‌.కామ్‌పై ఆంక్షలు తప్పేట్లు లేవు. గతంలో గూగుల్‌ మాతృసంస్థ కూడా ఈ దేశంలో ఆంక్షలకు గురైంది. కాంపిటేషన్‌ నియమాలను ఉల్లంఘించినందుకు గానూ ఈ ఆంక్షలు విధించే అవకాశం ఉందని జర్మనీ మోనోపోలీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అచిమ్‌ వాంబచ్‌ వెల్లడించారు. అమేజాన్ ప్రైమ్...

read more
భారత్‌లో ఐఫోన్ల విక్రయం డౌన్.. ఆపేయాలనుకుంటున్న యాపిల్

భారత్‌లో ఐఫోన్ల విక్రయం డౌన్.. ఆపేయాలనుకుంటున్న యాపిల్

ప్రముఖ యాపిల్ సంస్థ ఐఫోన్ల విక్రయాన్ని భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా ఐఫోన్ విక్రయాలు భారత దేశంలో తక్కువగా వుండటమే. ముఖ్యంగా ఐఫోన్ 6 విక్రయాలను భారత్‌లో ఆపేయాలని యాపిల్ నిర్ణయించింది. అంతేగాకుండా 35శాతం కంటే తక్కువ...

read more
ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..

ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..

మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ అప్‌డేట్ పొంద‌నున్న తన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఈరోజు వెల్లడించింది. ఈ జాబితాలో ప్రకటించిన ఫోన్‌లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ ల‌భిస్తుంద‌ని సంస్థ పేర్కొంది. దీని వల్ల యూజర్లు కొత్త ఓఎస్‌లో...

read more
హువావే నోవా 4ఇ స్మార్ట్‌ఫోన్… కొనాలనుకునేవారు ఇవి తెలుసుకోండి

హువావే నోవా 4ఇ స్మార్ట్‌ఫోన్… కొనాలనుకునేవారు ఇవి తెలుసుకోండి

హువావే నుండి మరొక స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. హువావే నోవా 4ఇ మోడల్‌ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20,720గా నిర్ణయించారు. ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది. హూవావే నోవా 4ఇ ఫీచర్లు ఇవే.. 6.15 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,...

read more
జియో ఫోన్ 3 పేరుతో టచ్ ఫోన్.. రిలయన్స్ దృష్టి

జియో ఫోన్ 3 పేరుతో టచ్ ఫోన్.. రిలయన్స్ దృష్టి

భారత టెలికాం రంగంలో 2016లో వచ్చిన జియో భారీ మార్పులను తీసుకొచ్చింది. మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని మాసాలకే ప్రముఖ సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారుల చేరికలో ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్‌ను నెలకొల్పింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల...

read more
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్‌ విడుదల

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్‌ విడుదల

శామ్‌సంగ్ నుంచి శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్‌ విడుదలైంది. చైనాలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో కూడుకున్నది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనీస్ ఆన్‌లైన్ రీటైలర్ జేడీడాట్‌కామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. 6జీబీ రామ్‌ను కలిగివుండే ఈ ఫోనును పొందేందుకు ప్రీ-ఆర్డర్స్...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.