మహిళలందరికీ అయ్యప్ప దర్శనం… సమ్మతించిన దేవస్థాన బోర్డు

మహిళలందరికీ అయ్యప్ప దర్శనం… సమ్మతించిన దేవస్థాన బోర్డు

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు ఇకపై మహిళలు కూడా వెళ్లొచ్చు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీపీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయం గతంలో అనుసరించిన తీరుకు పూర్తి విరుద్ధం కావడం గమనార్హం. కాగా, ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు...

read more
మూడు పసిడి కిరీటాలు ఏమయ్యాయ్?

మూడు పసిడి కిరీటాలు ఏమయ్యాయ్?

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం కాసుల వర్షం కురుస్తూనే వుంటుంది. వెంకన్నకు భారీగా విరాళాలు, కానుకలు వచ్చి చేరుతుంటాయి. తిరుమల ఆలయంలోని వెంకన్నకు పసిడి కిరీటాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తితిదే ఆధ్వర్యంలోని గోవింద...

read more
వైఫై సంకేతాలతోనే స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌

వైఫై సంకేతాలతోనే స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్‌తోనే చార్జ్‌ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ రెక్టెన్నా అనే ప్రత్యేకమైన పరికరం సాయంతో...

read more
భారీ శ్రీవారి ఆలయం.. కశ్యప శిల్పాశాస్త్రంలోని?

భారీ శ్రీవారి ఆలయం.. కశ్యప శిల్పాశాస్త్రంలోని?

అమరావతిలో భారీ శ్రీవారి ఆలయానికి అంకురార్పణ జరగనుంది. దీని కోసం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. జనవరి 31న చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఫిబ్రవరి...

read more
‘ఫ్యూచర్‌’ వ్యాపారం.. రూ. 40కే భోజనం!

‘ఫ్యూచర్‌’ వ్యాపారం.. రూ. 40కే భోజనం!

ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి ఫ్యూచర్‌ గ్రూప్‌ అడుగుపెడుతోంది. భోజనప్రియులకు సరసమైన ధరలకే నోరూరించే వంటకాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ వెల్లడించింది. సొంత వంటశాలలను ఏర్పాటు చేసి.. ఇక్కడ నుంచి రూ.40కే భోజనం, రూ.10కే రెండు సమోసాలను అందించే దిశగా...

read more
2019వ సంవత్సరం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు.. ఎప్పుడెప్పుడో తెలుసా?

2019వ సంవత్సరం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు.. ఎప్పుడెప్పుడో తెలుసా?

2019వ సంవత్సరం మొత్తం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సంపూర్ణ సూర్య గ్రహణాలు కాగా, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. అలాగే ఒకటి పాక్షిక చంద్రగ్రహం, మరొకటి పాక్షిక సూర్యగ్రహణం. ఇక పదమూడేళ్లకు ఒకసారి సూర్యుడు కక్ష్యను దాటి బుధుడు సంచరిస్తాడు. ఇది 2019...

read more
30 యేళ్ళు దాటిన తరువాత పెళ్ళిచేసుకునేవారు..

30 యేళ్ళు దాటిన తరువాత పెళ్ళిచేసుకునేవారు..

జీవితంలో స్థిరపడ్డాకే పెళ్ళి. ఈమధ్య కాలంలో చాలామంది యువతీయువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్ళి తరువాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడటం ఇష్టం లేక కొంతమంది ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. అంతేకాదు పెళ్ళి తరువాత ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఆర్థికంగా నిలదొక్కుకోగలమన్న...

read more
మానవ మూత్రంతో ఇటుకలు!

మానవ మూత్రంతో ఇటుకలు!

మానవ మూత్రం అనగానే.. ఛీ అని అనుకుంటాంగానీ.. ఈ రోజుల్లో మొబైల్‌ ఛార్జింగ్‌ మొదలుకొని హైడ్రోజన్‌ ఉత్పత్తి వరకూ రకరకాలుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడీ జాబితాలోకి బయో కాంక్రీట్‌ కూడా వచ్చి చేరింది. సముద్రతీరంలో...

read more
లెజెండరీ మ్యుజీషియన్‌ అన్నపూర్ణా దేవి కన్నుమూత

లెజెండరీ మ్యుజీషియన్‌ అన్నపూర్ణా దేవి కన్నుమూత

ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్‌ అవార్డు గ్రహీత అన్నపూర్ణా దేవి(91) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో  బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌ కాండీ తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని మహిళా...

read more

వద్దమ్మా.. పెళ్లి వేడుకున్నా.. చలించని తల్లి అధికారులను ఆశ్రయించిన బాలిక రేపల్లెలో నిలిచిన బాల్య వివాహం

*  పద్నాలుగేళ్లకే పెళ్లి.. వద్దంది చిట్టి తల్లి కాదంది కన్నతల్లి.. వేడుకుంది ప్రణమిల్లి కరగలేదు ఆ హృదయం..  ఆదుకుంది అధికార దళం వివాహం చేయమన్నారు బంధుగణం.. *  ఇది నిజమని నమ్మి చేరింది గృహం కల్యాణం కాదన్న ఆ బాలిక ఆనందం.. పెద్దల మోసంతో నిలవలేదు ఎంతో సమయం మళ్లీ...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.