పెళ్లి కావడంతో సరళం

పెళ్లి కావడంతో సరళం

సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప విద్యావేత్త, సాహితీవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు. చమత్కార సంభాషణా ప్రియులు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు సెనేట్‌ సభ్యుల్లో పి.కమలమ్మ అనే యువతి ఉండేవారు. ఆమె సమావేశాల్లో చాలా పరుషంగా, కటువుగా...

read more
అర్థమైందా నాన్నగారూ?

అర్థమైందా నాన్నగారూ?

‘‘చూడండీ.’’ ‘‘..........’’ ‘‘మిమ్మల్నే’’ ‘‘ఊ– రేపు నాకు బడిలేదు... నిద్రపోనీ.’’ ‘‘మాట; – రేపు మీరు కార్తీక సోమవారం ఉంటారా?’’ ‘‘సోమవారం ఉండటమా? ఎక్కడ?’’ ‘‘ఎక్కడేమిటి? – ఇంకా మీకు మెలుకవ రాలేదూ? కార్తీక సోమవారం ఉపవాసం ఉంటారా?’’ ‘‘ఉండను.’’ ‘‘పోనీయండి, నేను సముద్ర...

read more
రామాయణం… ఎందుకు చదవాలి?

రామాయణం… ఎందుకు చదవాలి?

భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు... రామాయణ, భారత, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు...

read more
ఎవరినైనా ఎంతవరకు నమ్మాలంటే…

ఎవరినైనా ఎంతవరకు నమ్మాలంటే…

నేటి కాలంలో యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు?. ‘జీవితంలో ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదు!’ అనేది కూడా ఆ సమస్యల్లో ఒకటి. ఈర్ష్య, అసూయ, ద్వేషం పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో మంచితనం, మానవత్వం దండిగా ఉన్నవారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు....

read more
ఊరు ఒక పండుగ

ఊరు ఒక పండుగ

పట్టణంలో ఉన్నప్పుడు పల్లెటూరికి పోయి ఉండాలనిపిస్తుంది. తీరా, పల్లెటూళ్లో పట్టుమని పదిరోజులైనా ఉండలేను. వింతగా తయారయ్యాను నేను. అసలు పల్లెటూరికే మతిపోయినట్లుంది ఇప్పుడు. ఇదివరకు ఎలా గుండేది. పాపం, నిశ్చలంగా నిశ్చింతగా! ‘‘కాలవ ఒడ్డున ఒరిగి నీడ చూసుకేనేదో, చేలనడుమ...

read more

నీ పోరు పడలేను నాయుడుబావా

చిత్రకారుడు, కథకుడు, కవి, నవలాకారుడు అడివి బాపిరాజు కళాసేవలో తన్మయులై వున్నప్పటికీ, వుద్యోగం పురుష లక్షణమనే భావంతో నాలుగేళ్లు న్యాయవాద వృత్తిని చేపట్టారు. సరసులు, సహృదయులు, సంపన్నులు అయిన గంధం వెంకయ్యనాయుడు దగ్గర జూనియర్‌గా చేరారు. అయితే బాపిరాజు వృత్తిలో పైకి రావాలనే...

read more
తినలేని అందం

తినలేని అందం

సుందరానికి అలిపిరి గాలిగోపురం అందుకోవలసిన ఆదర్శంలా కనిపిస్తూ ఉండేది. అప్పట్లో అతడు హైస్కూల్లో చదువుకునే కొంటె విద్యార్థి. కొత్తగా కొండపైకి రహదారి వేసిన రోజులు. బస్సుల్లో వెళ్తే రావలసినంత పుణ్యం రాదేమోనని యాత్రికుల్లో ఎక్కువమంది మెట్ల వెంబడే వెళ్తుండేవాళ్ళు. ఎత్తయిన...

read more
దీపశిఖా కాళిదాసు

దీపశిఖా కాళిదాసు

ఒక రాత్రివేళ ఒక వ్యక్తి ఒక వీధిలో నిలబడి గొప్పవెలుగునిస్తున్న ఒక దివిటీని చేతితో పట్టుకొని ముందుకు వెళుతున్నా డనుకొందాం. ఆ దివిటీకి ముందున ఉన్న భవనాలు, వస్తువులు ధగధగా వెలిగిపోతూ ఉంటై. ఆ కాగడా ముందుకు దాటిపోగానే ఆ భవనాలు, ఆ వస్తువులన్నీ ఆ తేజస్సును కోల్పోవటమే కాకుండా...

read more
ఈ హత్య నేరం కాదు

ఈ హత్య నేరం కాదు

ఇంతమంది చూస్తూవున్నా, హత్య ఉద్దేశపూర్వకమా, ఆకస్మిక సంభవమా అన్న విషయం సమస్యగానే ఉండిపోయింది. చైనా గారడీవాడు హాన్‌. గారడీ చేస్తూ కత్తి విసిరేసరికి అతని భార్య మెడలో రక్తనాళం తెగింది. తక్షణం చనిపోయింది. అతణ్ణి వెంటనే ఖైదు చేశారు. ఆ సమయానికక్కడ కంపెనీ డైరెక్టరు, హాన్‌...

read more
శుభం శుభమే

శుభం శుభమే

ఈవేళో రేపో కాలవ తెరుస్తారు. తవ్వు ఇంకా పూర్తికాలేదు. కంట్రాక్టరు కోప్పడతాడు. ఇంకా చిన్న గుంట దగ్గర ఓ వంద గజాల మేర కాలవ తవ్వి గట్టు బాగు చెయ్యాలి. దొరికినంతమంది కూలీలను రాత్రికి రాత్రి పోగుచేశాను. పనికాకపోతే కాంట్రాక్టు డబ్బు ప్రభుత్వం వారు ఇవ్వరు. ఎండిన కాలవ నీటికోసం...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.