ఆ వార్తల్లో నిజం లేదు : వైజయంతీ మూవీస్‌

ఆ వార్తల్లో నిజం లేదు : వైజయంతీ మూవీస్‌

మహానటి సినిమాను నిర్మించి టాలీవుడ్‌లో మళ్లీ తన సత్తాను చాటుకుంది వైజయంతీ మూవీస్‌. ఒకప్పుడు తిరుగులేని హిట్‌లు ఇచ్చిన ఈ సంస్థ గత కొంతకాలంపాటు విజయాలను అందించలేకపోయింది. మహానటి ఇచ్చిన కిక్‌తో మళ్లీ వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తోంది. రీసెంట్‌గా ‘దేవదాస్‌’ తో...

read more
మార్పుకి ముందడుగు

మార్పుకి ముందడుగు

‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి  బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్‌ బాల్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా...

read more
ఆ పాటల్లో నేనుండటం ఆనందం

ఆ పాటల్లో నేనుండటం ఆనందం

‘‘నా సినిమాల్లో మొదట్నుంచీ విలువలతో కూడిన హాస్యం, విలువలతో కూడిన కథలకే చోటు ఇచ్చా. 42ఏళ్లుగా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించిన స్థానాన్ని కోల్పోలేదంటే కారణం అదే’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలో...

read more
జన చేతన కోసమే..

జన చేతన కోసమే..

తనకెంతో ఇష్టమైన వైద్యవిద్యలో డిగ్రీ పట్టా తీసుకున్నారామె... అంతేనా....తనకెంతో ప్యాషన్‌ అయిన ఐపిఎస్‌ని కూడా సాధించారు! ఐపిఎస్‌ కావాలన్న తన కోరికకు స్ఫూర్తి వైద్యవిద్యే అంటారామె. ఆమే మైలాబత్తుల చేతన! ‘ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందు గుర్తొచ్చేది పోలీసులే’ అంటున్నారీ 26...

read more
బ్యాంకు ఉద్యోగాల్లో త్రీ ఛీర్స్‌!

బ్యాంకు ఉద్యోగాల్లో త్రీ ఛీర్స్‌!

ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు బ్యాంకు ఉద్యోగాలు! వెనుకబాటు వారి లక్ష్యానికి అడ్డంకి కాలేదు. గ్రామీణ నేపథ్యం భారమూ కాలేదు. ఇష్టంగా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చని ఆ ముగ్గురు అమ్మాయిలూ నిరూపించారు. వాళ్ళ నేపథ్యాలు వేరు! పరీక్షలో భాగంగా ఉన్న టాపిక్స్‌పై పట్టు...

read more
బాల్యమంతా మన్యంలోనే…

బాల్యమంతా మన్యంలోనే…

మన్యం ప్రాంతంలోనే బాల్యమంతా గడిపారు. దాంతో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ అవగాహన ఏర్పడింది. ఆ సమస్యలకు పరిష్కారం చూపాలంటే ‘సివిల్‌ సర్వీసెస్‌’తో సాధ్యమని గ్రహించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ‘ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సూచనతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాన’ని...

read more

మనిషి మనుగడకు కవిత్వమే ఓజోన్‌ పొర శిఖామణి

ప్రముఖ కవి శిఖామణి. (సంజీవరావు). కవి సంధ్య పత్రిక స్థాపకులు, యానాం పొయిట్రీ ఫెష్టివల్‌ ద్వారా కొత్త కలాల్ని ప్రోత్సహిస్తూ , కవిత్వానికి వన్నె తెస్తున్నారు . భూమికి ఓజోన్‌ పొరలా, మనిషి మనుగడకు ,ఉన్నతికి కవిత్వం ఓ రక్షణ కవచం అంటున్న శిఖామణి ఇంటర్వ్యూ ..... మాది...

read more
మహాచార్య

మహాచార్య

అన్నీ తెలిసిన మనిషి.. ఆవేశపడని మనిషి.. ఆలోచించే మనిషి.. జాగ్రత్త చెప్పే మనిషి... పక్కన ఉంటే భరోసాగా ఉంటుంది. రోశయ్య అలాంటి భరోసా ఇచ్చిన మనిషి. అదుపు తప్పబోయిన పరిస్థితుల్ని బ్యాలెన్స్‌ చేసిన మనిషి. ఈ రాజనీతిజ్ఞత మహా మహా ఆచార్యులకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆయన...

read more

లక్ష్యం కోసం నృత్యం వదిలేశా: కలెక్టర్ శ్వేతా మహంతి

ఇంజనీరింగ్‌ చేసి మంచి ఉద్యోగం సాధించారు. అయినా ఆత్మసంతృప్తి కలగలేదు. ఆ ఉద్యోగం చేస్తున్నన్ని రోజులు చదువుకునేప్పుడు చేసిన వాలంటరీ సేవలే గుర్తుకొచ్చేవి. పైగా ఆమె తండ్రి రిటైర్డ్‌ ఐఏఎస్‌. ఆయన స్ఫూర్తితోనే సివిల్స్‌వైపు అడుగేశారామె. రెండో ప్రయత్నంలో ఏకంగా ఆల్‌ఇండియా...

read more
‘మాకు దెయ్యాలు ఎలాంటి హానీ చెయ్యలేదు’

‘మాకు దెయ్యాలు ఎలాంటి హానీ చెయ్యలేదు’

రాధికా అప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్‌ థ్రిల్లర్‌ ‘గూల్‌’ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇన్సిడియస్‌, గెట్అవుట్‌, ఉడ్తా పంజాబ్‌ లాంటి డిఫరెంట్‌ మూవీస్‌ ను...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.