పులి మళ్లీ లేచింది

పులి మళ్లీ లేచింది

ఆటలో అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. అప్రతిహత విజయాలతో సాగిపోయాడు. ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకున్నాడు. ప్రపంచ క్రీడా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. వేల కోట్లు సంపాదించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కానీ అతను సంపాదించుకున్న కీర్తి మొత్తం...

read more
తాను.. నేను రాణి రాజు

తాను.. నేను రాణి రాజు

అత్యంత చిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన తొలి భారత ఆటగాడు, తెలుగు రాష్ట్రాల తొలి గ్రాండ్‌మాస్టర్‌.. పెంటేల హరికృష్ణ. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత నంబర్‌ టూగా దేశంలో చెస్‌కు ఆదరణ తేవడంలో హరిది కీలకపాత్రే. కామన్వెల్త్‌ విజేతగా, ప్రపంచ జూనియర్‌,  ఆసియా ఛాంపియన్‌గా...

read more
ఆదర్శం.. ఈ యువ దంపతులు

ఆదర్శం.. ఈ యువ దంపతులు

ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగాలు సాధించిన మల్లేశ్వరరావు, శ్రావణి అన్నపురెడ్డిపల్లి(భద్రాద్రి కొత్తగూడెం), 11-10-2018:ఉన్నత స్థాయి ఉద్యోగం సాదించే వరకు పిల్లలు వద్దనుకున్నారు. పట్టుదలతో చదివారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా అటవీ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా...

read more

కట్టె గానుగ నూనె.. తాటి బెల్లం!

గాంధీ మహాత్ముడి స్ఫూర్తి రైతులు స్వల్ప ఖర్చుతోనే చెక్క గానుగలు ఏర్పాటు చేసుకోవచ్చు తాటి, ఈత బెల్లం తయారీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతే తరువాయి సబ్సిడీ రుణాలు, శిక్షణ ఇవ్వడానికి సిద్ధమంటున్న ఖాదీ కమిషన్‌ జాతిపిత గాంధీజీ పుట్టి నేటికి 150 ఏళ్లు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు...

read more

కోట్లు కుమ్మరించినా ఆ పని మానలేను

కలాం కలలు మదర్‌ థెరీసా యుగోస్లేవియాలో పుట్టింది. భారతదేశం వచ్చింది. తోటివారిలాగే పాఠాలు చెప్పేది. ఓ రోజు రాత్రి కలకత్తాలో వీథిలో వెడుతుండగా ఓ అనాథ స్త్రీ విపరీతమైన అనారోగ్యంతో వచ్చి ఆమె చేతుల్లో పడింది. ‘ప్రాణం పోతోంది, చాలా బాధగా ఉంది. నన్ను డాక్టర్‌కు చూపించు’ అంది....

read more
అర్జున వెనుక.. అమ్మానాన్న

అర్జున వెనుక.. అమ్మానాన్న

పరిచయం  సిక్కీరెడ్డి కృష్ణార్జునులు డబుల్స్‌ ఆడి...కురుక్షేత్రంలో విజయం సాధించారు. సిక్కీరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి.. ‘ఆడేది నువ్వు. ఆడించేది నీ ప్రతిభ’అంటూ కూతుర్ని క్రీడా కురుక్షేత్రానికి సిద్ధం చేశాడు. ఆ అమ్మాయి ఆడింది. ‘అర్జున’ అవార్డు గెలిచింది. సిక్కీరెడ్డి...

read more
‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’

‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’

లైంగిక బానిస నుంచి నోబెల్‌ గ్రహీతగా నదియా మురాద్‌ ఒకప్పుడు ఐసిస్‌ బానిసగా మృగాళ్ల కబంధ హస్తాల్లో చిత్రవధ అనుభవించింది... కుటుంబాన్ని కోల్పోయింది.. మూడు నెలల పాటు తనపై కొనసాగిన అత్యాచారాలను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది..  కానీ నాడు అలా చేసి...

read more
బాలు చేసిన మేలు

బాలు చేసిన మేలు

1983...బొంబాయిలో నేషనల్‌ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రకటన వెలువడింది. ఆ పోటీల్లో పాల్గొనేందుకు రెండు పెద్ద జట్లను ఎంపిక చేయాలని తమిళనాడు చదరంగ క్రీడా సంస్థ కార్యవర్గం నిర్ణయించింది. ఆ మేరకు ఆటగాళ్లను ఎంపిక చేసి, వారిని బొంబాయి పంపించేందుకు విరాళాలు కూడా...

read more
కోల్‌కతాలో పసిపిల్లాడూ గుర్తుపడతాడు

కోల్‌కతాలో పసిపిల్లాడూ గుర్తుపడతాడు

ఇప్పుడు భారత ఫుట్‌బాల్‌ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కూడా కష్టం. కానీ ఒకప్పుడు భారత్‌ సెమీస్‌ వరకు వెళ్లింది. మరెన్నో ప్రతిష్టాత్మక టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అలాంటి జట్టులో సభ్యుడైన దిగ్గజ ఆటగాడు ప్రస్తుత భారత ఫుట్‌బాల్‌ దుస్థితిని చూసి...

read more
మానవత్వాన్ని,  ప్రేమను ఎవరైనా  తృణీకరించగలరా?

మానవత్వాన్ని, ప్రేమను ఎవరైనా తృణీకరించగలరా?

చెట్టు నీడ భగవంతుడే ఈ నిరుపేద రూపంలో వచ్చినట్లు స్వామీజీ భావించారు. అతడి వంక చూస్తూ ఆయన,  ‘‘తినడానికి ఏమైనా ఇవ్వగలవా?’’ అని అడిగారు. అది రాజస్థాన్‌లోని రైలు నిలయం. స్వామి వివేకానంద అక్కడ బస చేసి ఉన్నారు. పగలంతా జనం తీర్థప్రజలా ఆయన దర్శనార్థం వచ్చిపోతూనే ఉన్నారు. మతం,...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.