కీళ‌్లనొప్పులను దూరం చేసే.. మొక్కజొన్న

మనం స్నాక్స్‌గా తీసుకునే ధాన్యాలలో మొక్కజొన్న కూడా ఒకటి, దీనిని కూరలు, గ్రేవీల తయారీలో కూడా వినియోగిస్తారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చి స్నాక్స్‌గా తీసుకుంటే మంచి మజాగా ఉంటుంది. మొక్కజొన్న పొత్తులను సాధారణంగా నిప్పులపై కాల్చి వేడివేడిగా తింటుంటారు....

read more
తులసి విత్తనాలను నీటిలో నానబెట్టి…?

తులసి విత్తనాలను నీటిలో నానబెట్టి…?

తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. అదేవిధంగా వాటి విత్తనాలు కూడా అంతే మేలు చేస్తాయి. వీటిని తరచు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అలానే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును. మరి ఈ విత్తనాలు రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఓసారి...

read more
దోసకాయ పోషకాల గని …

దోసకాయ పోషకాల గని …

వేసవికాలంలో దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పండించే పంటలలో దోసకాయ నాలుగో స్థానంలో ఉంది. ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్‌లు,...

read more
జీర్ణశక్తి పెరుగుతుంది!

జీర్ణశక్తి పెరుగుతుంది!

వేసవిలో పెరుగు తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. రోజూ పెరుగు తింటే శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్‌ బి2, బి12, ప్రొటీన్లు, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా లభిస్తాయి. అంతేకాదు అనేక ఆరోగ్యలాభాలున్నాయి. అవేమిటంటే.. పెరుగులో లభించే బ్యాక్టీరియా అజీర్తి,...

read more
బీట్‌రూట్ తల్లిలాంటిది..

బీట్‌రూట్ తల్లిలాంటిది..

బీట్‌రూట్ శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది. మంచి పోషణను శరీరానికి అందిస్తుంది. కురుల సంరక్షణకు కూడా ఇది తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో అనేక ఔషధాలు ఉన్నాయి. అవి జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుండి కాపాడుతాయి. అయితే కేశ సంరక్షణ కోసం...

read more
భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే..?

భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే..?

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్,...

read more
ఆ ఒక్కటి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

ఆ ఒక్కటి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాల్లో, టీలో, యాలకులను ఉపయోగిస్తుంటాం. యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. అయితే రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు ఇలా...

read more
కప్పు ఆవాలను పొడిచేసుకుని తేనె లేదా పంచదారను?

కప్పు ఆవాలను పొడిచేసుకుని తేనె లేదా పంచదారను?

అనేక మంది ఈ రోజుల్లో డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. దీనికి కారణం ఇన్సులిన్ వైఫల్యం అని వైద్యులు చెబుతున్నారు. పాంక్రియాటిక్ గ్రంథి నుండి ఉత్పత్తి అయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ని నియంత్రిస్తుంది. ఈ వ్యాధి నుండి బయటపడాలంటే ఆవాలను ఉపయోగించాలని చెబుతున్నారు నిపుణులు....

read more
ఉదయాన్నే పరగడుపున క్యాలీఫ్లవర్ జ్యూస్ తాగితే?

ఉదయాన్నే పరగడుపున క్యాలీఫ్లవర్ జ్యూస్ తాగితే?

అన్ని కాలాలలో లభించే కూరగాయలలో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. ఇది చలికాలంలో మరింత ఎక్కువగా దొరుకుతుంది. ధరలు కూడా చౌకగానే ఉంటాయి. గోబిపువ్వుగా పిలవబడే ఈ కూరగాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు...

read more
నిద్రించే ముందు ఇలా చేస్తే..?

నిద్రించే ముందు ఇలా చేస్తే..?

ప్రకృతి జీవులన్నింటికీ నిద్ర అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. ఈ కారణంగానే యోగులు, మునులు, మహాపురుషులు అధిక సమయం ధ్యానం అనబడె ఒక రకమైన నిద్ర లేదా విశ్రాంతి స్థితిలో గడుపుతారు. ఇందువలే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. యోగశాస్త్రం ప్రకారం మనిషికి నిద్రపట్టడం లేదంటే.....

read more

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా..?

పూజగది అనేది ఇల్లు లేదా ఆఫీసులో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ధ్యానం మరియు ప్రశాంతతకు పూజగది కేంద్రం. ఇంట్లో పూజగది ఏ ప్రాంతంలో ఉన్న మంచిదే అని భావిస్తుంటారు. అయితే దీనిని వాస్తుశాస్త్రం ప్రకారం ఉంచినట్లయితే, దీని నుండి భక్తులు శోషించుకునే శక్తి రెట్టింపవుతుంది. పూజగది కొరకు వాస్తు చిట్కాలు పాటించడం వలన గృహం మొత్తంలో ఉండే సానుకూల శక్తిని రెట్టింపు చేయవచ్చును.

గృహానికి ఈశాన్య స్థానం పూజగది నిర్మించడానికి అత్యుత్తమైనది. వాస్తు పురుషుడు తన తల ఈశాన్య దిక్కులో పెట్టి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోనే ప్రతిరోజూ ఉదయం సూర్యకిరణాలను పొందుతుంది. ఇది వాతావరణాన్ని పరిశుద్ధం చేసి రోజంతటికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది. అయితే, గృహం యొక్క నిర్మాణం అదేవిధంగా ఇంటి పెద్ద యొక్క పుట్టిన రోజు ఆధారంగా ఈ దిక్కు మారుతుంది. అందుకని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా.. అంటే వాస్తు ప్రకారం, ప్రధాన ద్వారానికి ఎదురుగా పూజగది ఉండరాదు. ఎందుకంటే ఇది పూజగదిలో సృష్టించబడ్డ సానుకూల శక్తిని తగ్గిస్తుంది. పూజగది అనేది మీ ఇంట్లో దేవుని గది.. అందువలన గదిని చీకటిగా ఉంచరాదు. పూజగదిలో చీకటిగా ఉండడం వలన మొత్తం ఇంటి యొక్క స్వస్థత దెబ్బతింటుంది. అందువలన ఈ గదిలో కనీసం ఒక దీపం వెలిగించడం మంగళకరం.

ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పూజగది ఉంచరాదు. ఇది విశ్రాంతి, వినోదం కొరకు ఉపయోగించే ప్రదేశం. అలానే టాయిలెట్ యొక్క వ్యతిరేక శక్తి ఇంట్లో వ్యాపించకుండా నిరోధించడం కొరకు ఈ గదిపైన, దిగువన లేదా ఎదురుగా టాయిలెట్‌ని రూపొందించరాదు.

కొబ్బరికాయ నిలువుగా పగిలితే..

గుడికి వెళ్లినా, పండుగలు చేస్తున్నా దేవున్ని పూజించేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. హిందువులు కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రామాయణ, మహాభారతాలలో కూడా టెంకాయకు గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి.

దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మంది వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురౌతారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోష పడతాం. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది.

కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళై వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. అలాకాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని సూచన.

టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు. చింతించాల్సిన అవసరంలేదంటున్నారు జ్యోతిష్యులు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టి పోయిందని అర్థం. పండుగ రోజు దేవుడికి పూలు, టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట. సమర్పించడం ముఖ్యం కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట.

ఆత్మవిచారణతోనే యోగ స్థితి

కస్త్వం కో హం కుత ఆయాతః
కామే జననీ కోమే తాతః
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
పాప, పుణ్య భావాలే లేని యోగి స్థితి మనిషికి రావాలంటే ఏం చేయాలో తెలిపే శ్లోకమిది. శంకర భగవత్పాదులవారి శిష్యులైన యోగానందులవారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. మనిషి ఆత్మానుభూతి చెందాలంటే.. ‘నేను పరమాత్మను’ అనే అనుభూతి కలగాలంటే నిరంతరం ఆత్మ విచారణ చేయాలి. ‘నేనెవరు? నీవెవరు? ఎక్కణ్నుంచి వచ్చాం? ఈ తల్లిదండ్రులెవరు?’ అని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సరైన సమాధానాలు రాబట్టుకోవడమే ఆత్మవిచారణ అని ఈ శ్లోకం భావం. ఆత్మవిచారణ వల్లనే ఆత్మను గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆత్మవిచారణలో భాగంగా వేసుకునే ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా ఎవరో ఒకరు చెబితే రావు. స్వయంగా వెతకాలి. విచారణ చేయాలి. విశ్లేషణ చేయాలి. అందుకు నిర్మలమైన మనోబుద్ధులు కావాలి. అంటే.. ప్రాపంచిక విషయాలలో చిక్కుపడనివి. మన మనసు, బుద్ధి ఈ ప్రపంచంలోని అనిత్యమైన విషయాల మీద, భోగాల మీద నిలిచి కలుషితమైపోయి ఉంటున్నాయి. కనుక ఆ కల్మషాలను ముందు వదిలించాలి. అసలు మన మనసు ప్రాపంచిక విషయాల్లో ఎందుకు చిక్కుబడిపోయిందంటే..

ప్రపంచంపై సరియైున అవగాహన లేకనే. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవడం వల్లనే.. ‘ఇది నిత్యమైనది, సత్యమైనది, దీని ద్వారా మనం ఆనందాన్ని పొందవచ్చు’ అని భ్రమపడతాం. కనుక ముందు ప్రపంచం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి. ఈ విశ్వం ‘స్వప్నవిచారం’ అని పెద్దలు చెబుతున్నారు. అంటే.. కల లాంటిది. స్వప్నం అబద్ధమని మనకు తెలుసు. కలలో లాభం వస్తే.. అది నిజమైనది కాదు గనుక సంతోషించాల్సిన పని లేదు. నష్టం వస్తే చింతించాల్సిన పనీ లేదు. లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, సుఖమైనా.. మెలకువ వచ్చేంతవరకే. మన జీవితమూ అంతే. మనిషి జాగ్రదావస్థలోంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే.. నిజస్వరూపమైన ఆత్మగా నిలిచిపోతే.. ఈ జీవితమంతా కలలాంటిదే అని అర్థమవుతుంది.

‘నేను’ అంటే ఈ శరీరం కాదని.. ఈ మనోబుద్ధులు కాదని.. వీటన్నిటికీ వేరుగా, ఆకాశంలాగా ఆకారం లేకుండా సర్వవ్యాపకమై ఉన్న చైతన్యస్వరూపం అని.. తెలుస్తుంది. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు అందరూ ఆ పరమాత్మ స్వరూపాలేననే గ్రహింపు వస్తుంది. మనిషి అసలు స్వరూపం ఆత్మ అని.. ఇప్పటి రూపం దాని ప్రతిబింబం మాత్రమేనని అర్థమవుతుంది. ఈ విధంగా విచారణ చేసి.. ప్రపంచం మిథ్య అని గ్రహిస్తే ప్రాపంచిక విషయాలకు తపించం. ఇక్కడి సుఖాల కోసం పాకులాడం. ఇక్కడి అనుభవాలను స్వల్పవిషయాలుగా భావించి వాటిని విడిచిపెడతాం. మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతాం. అదే ఆత్మ స్థితి. మోక్ష స్థితి. యోగ స్థితి.