సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి…

సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి…

మనకు ప్రకృతి పరంగా, సహజసిద్దంగా లభించే వాటిల్లో సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఒకటి. ఇది అధిక పోషకాలు కలిగిఉన్న పండు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్,...

read more
కొబ్బరినూనెను నోట్లో వేసుకుని.. ఇలా చేస్తే..?

కొబ్బరినూనెను నోట్లో వేసుకుని.. ఇలా చేస్తే..?

సాధారణంగా పదిమందిలో మాట్లాడాలంటే కొందరు ఆసక్తి చూపించరు. ముఖ్యంగా తమ నోటి దుర్వాసన ఇతరులను ఇబ్బంది పెడుతుందని భావిస్తుంటారు. రుతువులు, కాలాలతో సంబంధం లేకుండా చాలామందిని బాధించే సమస్య ఇది. ఈ సమస్యను నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో చూద్దాం.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం...

read more
పచ్చి బఠానీలతో టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చు..!

పచ్చి బఠానీలతో టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చు..!

డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారిలో క్లోమగ్రంథి ప‌నిచేయ‌ని కార‌ణంగా ఇన్సులిన్ విడుద‌ల కాదు. ఫలితంగా ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇక టైప్ 2 డయాబెటిస్‌ను కలిగి ఉన్న వారిలో క్లోమగ్రంథి విడుద‌ల చేసే...

read more
పుట్టగొడుగులతో దిట్టమైన మెదడు!

పుట్టగొడుగులతో దిట్టమైన మెదడు!

శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ప్రొటీన్లు అంత సులువుగా జీర్ణం కావు.. కానీ, పుట్టగొడుగుల్లోని ప్రొటీన్లు మాత్రం, అత్యంత సులువుగా 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు క్షీణించిపోతుంటాయి. ఫలితంగా మతిమరుపును కలిగించే...

read more
మెంతులు నానబెట్టిన నీరు తాగితే..

మెంతులు నానబెట్టిన నీరు తాగితే..

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచు ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు...

read more
రోజూ అర కప్పు.. ఆపిల్ ముక్కలు తింటే

రోజూ అర కప్పు.. ఆపిల్ ముక్కలు తింటే

రోజూ ఓ యాపిల్ తింటే.. హృద్రోగాలను నివారించవచ్చు. యాంటి ఆక్సిడెంట్స్‌ అధికంగా కలిగి ఉన్న యాపిల్‌ మనకు పలురకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ ఒక యాపిల్‌ తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ రానే రాదు....

read more
బార్లీ గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

బార్లీ గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది. బార్లీని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీ గింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి. బార్లీలో బి-విటమిన్లు, పీచు...

read more
పెరుగు వాము కలిపి తీసుకుంటే..?

పెరుగు వాము కలిపి తీసుకుంటే..?

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటి వేసవి కాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. పెరుగు తీసుకోవడం వలన వేసవి తాపంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పెరుగుని కింద సూచించిన విధంగా ఉపయోగిస్తే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.. కప్పు పెరుగులో...

read more
రోజూ ఉదయాన్నే లెమన్ జ్యూస్ తాగితే..?

రోజూ ఉదయాన్నే లెమన్ జ్యూస్ తాగితే..?

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇవిగోండి.. వెయిట్ లాస్ ప్లాన్స్. ఉదయం నిద్రలేవగానే, ఓ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. ఈ హెల్దీ చిట్కా ద్వారా శరీరాన్ని మనస్సును తాజాగా ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వలన ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. ఉదయం నడక లేదా చిన్న పాటి...

read more
కీరదోస జ్యూస్ తాగితే?

కీరదోస జ్యూస్ తాగితే?

చూడగానే తినాలనిపించే కీరదోస వేసవిలో సాంత్వననివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని,...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.