చాక్లెట్ బర్ఫీ..

చాక్లెట్ బర్ఫీ..

కావలసిన పదార్థాలు: పాలు - 400 గ్రా చక్కెర - 6 స్పూన్స్ నెయ్యి - 1 స్పూన్ బాదం పప్పు - ఆరు కోకో పౌడర్ - 1 స్పూన్. తయారీ విధానం: ముందుగ్ స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. తరువాత అందులో పాలు పోసి చిన్న మంటమీద వుంచి చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. నిమిషం తరువాత కోకో...

read more
పన్నీర్ పకోడీలు

పన్నీర్ పకోడీలు

కావలసిన పదార్థాలు: పన్నీర్ - పావుకిలో శెనగపిండి - 1 కప్పు కారం - స్పూన్ పచ్చిమిర్చి - 4 ఉప్పు - తగినంత నూనె - సరిపడా. తయారీ విధానం: ముందుగా ఓ బౌల్‌లో శెనగపిండి, నీళ్లు పోసి కలుపుకోవాలి. అందులోనే కారం పొడి, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని...

read more
కోకోనట్‌ కార్న్‌ సూప్‌

కోకోనట్‌ కార్న్‌ సూప్‌

కావలసినవి: కొబ్బరి నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ, అల్లం- ఒకటిన్నర టేబుల్‌ స్పూను, పసుపు- పావు టీస్పూను, మొక్కజొన్న గింజలు- అయిదున్నర కప్పులు, కోకొనట్‌ ఫ్లేక్స్‌- సగం కప్పు, నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు. తయారీ: పెద్ద పాత్రలో కొబ్బరి నూనె తీసుకొని, మీడియం...

read more
విటమిన్ డి కావాలంటే.. ఈ వంటకాన్ని తినండి..

విటమిన్ డి కావాలంటే.. ఈ వంటకాన్ని తినండి..

చాలామందికి శరీరంలో విటమిన్స్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది విటమిన్ డి. ఈ విటమిన్ డి ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది. వాటిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.. నేటి తరుణంలో కాలుష్యం ఉండడం వలన ఇంట్లో, ఆఫీసు గదుల్లో అధిక సమయం గడపడం వలన విటమిన్...

read more
కాఫీ మిల్క్ షేక్..

కాఫీ మిల్క్ షేక్..

కావలసిన పదార్థాలు: ఇన్‌స్టంట్ కాఫీ పొడి - 1 స్పూన్ గోరువెచ్చని నీరు - పావుకప్పు చక్కెర - 4 స్పూన్స్ వెన్నతీయని పాలు - 2 కప్పులు ఐస్‌క్యూబ్స్ - 8. తయారీ విధానం: ముందుగా బ్లెండర్‌లో ఇన్‌స్టంట్ కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లుపోసి బాగా కలుపుకోవాలి. మిల్క్‌షేక్ కోసం...

read more
సగ్గుబియ్య పునుగులు…

సగ్గుబియ్య పునుగులు…

కావలసిన పదార్దములు: సగ్గుబియ్యం - రెండు కప్పులు, బియ్యం- ఒక కప్పు, మినపప్పు- అర కప్పు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- మూడు, సన్నగా కట్ చేసుకున్నవి, అల్లం -చిన్న ముక్క ఉప్పు- తగినంత, జీలకర్ర- కొద్దిగా, నూనె- నాలుగు టీ స్పూన్స్, తయారుచేయు విధానం : ముందుగా సగ్గుబియ్యం,...

read more
సపోటా ఐస్‌క్రీమ్

సపోటా ఐస్‌క్రీమ్

కావలసిన పదార్థాలు: సపోటా ముక్కలు - 2 కప్పులు పాలు - 1 లీటర్ జెలటిన్ - 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ - 1 స్పూన్ తాజా క్రీమ్ - అరకప్పు చక్కెర పొడి - 4 స్పూన్స్ తయారీ విధానం: ముందుగా పావుకప్పు పాలు పక్కనుంటి మిగతావి నాన్‌స్టిక్ పాన్‌లో మరిగించాలి. తర్వాత మంట తగ్గించి 20 నిమిషాల...

read more
ముల్లంగి బిస్కెట్లు

ముల్లంగి బిస్కెట్లు

ముల్లంగిని చాలా మంది ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అసలు ఇ్టపడరు. ఎందుకంటే ముల్లంగి గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. కానీ నిజానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ...

read more
కొత్తిమీర రైస్

కొత్తిమీర రైస్

కావలసిన పదార్థాలు: పొడి అన్నం - 1 కప్పు కొత్తిమీర - అరకప్పు అల్లం ముక్క - చిన్నది ఇంగువ - కొద్దిగా జీడిపప్పులు - 10 ఉప్పు - సరిపడా నూనె - తగినంత. తయారీ విధానం: ముందుగా కొత్తిమీర తరుగు, అల్లం ముక్క, పచ్చిమిర్చి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు...

read more
పుట్టగొడుగుల బిర్యానీ

పుట్టగొడుగుల బిర్యానీ

శాకాహారమైన పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. మాంసంహారం తిన‌ని వాళ్లు పుట్ట‌గొడుగులను తప్పనిసరిగా తమ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటి ద్వారా మాంసాహారం ద్వారా పొందే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఈజీగా పొంద‌వ‌చ్చు. శ‌రీరానికి కావాల్సిన మాంస‌కృత్తులు పుట్టగొడుగుల ద్వారా...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.