వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌

వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌

స్టాక్‌హోం: 2018 సంవత్సరానికి గానూ నోబెల్‌ పురస్కారాల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది అమెరికా, జపాన్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్‌‌ను పంచుకుంటున్నారు. జేమ్స్‌ పి అల్లిసన్‌(అమెరికా),...

read more
హైదరాబాద్‌లో ఆగస్టు 25న మాలతీ చందూర్ పురస్కార ప్రదానోత్సవం

హైదరాబాద్‌లో ఆగస్టు 25న మాలతీ చందూర్ పురస్కార ప్రదానోత్సవం

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి(చెన్నై), చందూర్ కుటుంబం, స్నేహితుల సంయుక్త ఆధ్వర్యంలో ‘శ్రీమతి మాలతీ చందూర్ పురస్కార ప్రధానోత్సవం’ జరుగనుంది. ఆగస్టు 25న శనివారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారకరామారావు...

read more
స్వర్ణంతో తిరిగొస్తానని..నా గురువుకి మాటిచ్చా

స్వర్ణంతో తిరిగొస్తానని..నా గురువుకి మాటిచ్చా

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తిరిగి వస్తానని తన గురువుకు ఇచ్చిన మాటను నిలబెట్టకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు భారత రెజ్లర్‌ పునియా. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్‌ 11-8తో టకాటని డైచి(జపాన్‌)ని ఓడించి...

read more
చిన్న వయసులో అరుదైన జొనార్దన్‌ రికార్డు

చిన్న వయసులో అరుదైన జొనార్దన్‌ రికార్డు

మాస్టర్‌ యల్లమిల్లి జొనార్దన్‌ 5 ఏళ్ళ అతి చిన్న వయస్సులో అపారమైన జ్ఙాపకశక్తితో అందరినీ అబ్బురపరిచి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. శనివారం లాలాపేట్‌లోని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ప్రధాన కార్యాలయంలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ వ్యవస్థాపక...

read more

జర్నలిస్టులకు పురస్కారం అందజేసిన మంత్రి హరీష్‌రావు

పని ఒత్తిడితో జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమని మంత్రి సూచించారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ...

read more

తెలంగాణకు మరో అరుదైన పురస్కారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే… విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో విశేష సేవలందించిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్...

read more

డాక్టర్‌ రఘురాంకు పురస్కారం

ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ సీఈవో, డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘురాం 2017 సంవత్సరపు ప్రతిష్ఠాత్మక ‘సామాజిక సేవా పురస్కారాన్ని’ దక్కించుకున్నారు. ది అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా అందించే ఈ అవార్డును జైపూర్‌లోని బీఎమ్‌ బిర్లా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ...

read more

రామారెడ్డికి ‘మెండా’ పురస్కారం

ప్రముఖ మానసిక వైద్యని పుణుడు డాక్టర్‌ బీసీరాయ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కర్రి రామారెడ్డిని మరో జాతీయ పురస్కారం వరించింది. ఇప్పటికే 25 డిగ్రీలు అందుకుని ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్న ఆయన ఐఎంఏ డాక్టర్‌ ఆర్‌ కే మెండా స్మారక పురస్కారాన్ని ఈనెల  ముంబైలో జరిగిన సమావేశంలో...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.