కథలతో మెదడుకు చురుకుదనం!

కథలతో మెదడుకు చురుకుదనం!

పిల్లలకు మనం చెప్పే కథలు వారి ఊహాశక్తికి పదును పెట్టడమే కాకుండా వారి మెదడును చురుకుగా తయారు చేస్తాయన్న విషయం ఇటీవల జపాన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని కోసం సుమారు మూడు వేల మంది చిన్నారుల మీద వారు దీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిని రెండు...

read more
మధ్యాహ్నపు కునుకు.. మెదడు చురుకు

మధ్యాహ్నపు కునుకు.. మెదడు చురుకు

పగటి పూట నిద్ర మంచిదా? కాదా? ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఎక్కువ సేపు నిద్రపోతే ప్రమాదమేనన్నది కొందరు పరిశోధకుల మాట. అయితే, పగటి పూట ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, పని చేసే ముందు కాసేపు కునుకు తీస్తే మెదడు చురుగ్గా ఉంటుందని వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌...

read more
మైగ్రేన్‌కు ‘ఇన్‌హేలర్‌’ చికిత్స

మైగ్రేన్‌కు ‘ఇన్‌హేలర్‌’ చికిత్స

తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచడం వల్ల వచ్చే నొప్పి మైగ్రేన్‌. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. మానసిక అశాంతి, అధిక నిద్ర, ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు ఎన్ని మందులు వాడినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతతతోనే అదుపులో పెట్టుకోవచ్చు....

read more

వాయుకాలుష్యంతో కిడ్నీ వ్యాధుల ముప్పు

విషవాయువులతో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని పలు అథ్యయనాలు వెల్లడవగా, వాయు కాలుష్యం తీవ్ర కిడ్నీ వ్యాధులకు దారితీస్తుందని తాజా అథ్యయనం పేర్కొంది. కిడ్నీ పనితీరుపై గాలిలోని హానికారక పదార్ధాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ చేపట్టిన అథ్యయనం...

read more
ఫ్రీగా ఎవరూ.. ఏదీ ఇవ్వరు!

ఫ్రీగా ఎవరూ.. ఏదీ ఇవ్వరు!

తక్కువ ధరకు, గిఫ్ట్‌ల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న వెబ్‌సైట్లు విషయం తెలియక మోసపోతున్న అమాయకులు డిజిటల్‌ మార్కెటింగ్, ఈ– కామర్స్‌ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే...

read more
ఇలా చేస్తే… గుండె పదిలం..!

ఇలా చేస్తే… గుండె పదిలం..!

గుండెను ప్రాణస్థానంగా చెప్పుకునే మనిషి, ఆ గుండె కోసం చేస్తున్నదేమిటి? కాపాడుకోవడం కన్నా ఎక్కువమంది అది చె డిపోయే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఫలితంగా...ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. అయితే, వీరిలో 80 శాతం మంది అభివృద్ది...

read more
వీటిని తీసుకుంటే మేలు!

వీటిని తీసుకుంటే మేలు!

సరైన ఆహారంతో సీజనల్‌ జలుబు, వైరల్‌ జ్వరాలను నివారించవచ్చు. వంటింటి పదార్ధాలు కొన్ని శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, నిరోధకశక్తిని పెంచుతాయి. సీజనల్‌ జ్వరాల నుంచి రక్షిస్తాయి. అవేమిటంటే.. వెల్లుల్లి: దీనిలో యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు...

read more
పిల్లల గుట్టు బయట పెట్టకండి!

పిల్లల గుట్టు బయట పెట్టకండి!

సాయంత్రం నాలుగు గంటలు... పని చేసుకుంటూనే మధ్యమధ్యలో గుమ్మం వైపు చూస్తోంది సంధ్య. అలా సమయం గడుస్తూనే ఉంది. కానీ ఉదయం అనగా స్కూల్‌కి వెళ్లిన నాలుగేళ్ల కూతురు ఇంకా ఇంటికి రాలేదు. ఆందోళనగా ఆఫీసులో ఉన్న భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన ఇంటికి వచ్చాడు. ఇద్దరూ...

read more
స్మార్ట్‌గా.. ఫిట్‌గా!

స్మార్ట్‌గా.. ఫిట్‌గా!

శరీరంలో చేరిన అనవసరమైన కొవ్వును కరిగించడానికి ఆండ్రాయిడ్‌, ఓఎస్‌ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఫిట్‌నెస్‌ యాప్స్‌ విశేషాలివి... సెవెన్‌ మినిట్‌ వర్కవుట్‌ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఈ బిజీ షెడ్యూల్‌లో వ్యాయామానికి ఖాళీ ఎక్కడిది అని ప్రశ్నించే వాళ్లూ...

read more
నిలకడగా నడిచేందుకు…

నిలకడగా నడిచేందుకు…

యసు మళ్లిన కొందరికి ఒక దశలో స్థిరంగా నడవలేని స్థితి ఏర్పడుతుంది. ఎక్కడ పడిపోతానా! అన్న భయం అడుగడుగునా వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల యదేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లే ధైర్యాన్ని కోల్పోతారు. ఈ పరిస్థితికి పెరిగిన వయసు తాలూకు కారణాలు చాలానే ఉంటాయి. వాటిల్లో కండరాలు...

read more

దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి

సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.

తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.

కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.

వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..

సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.

సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.

సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.

తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.

మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.

కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.