స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్ వినియోగమూ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎన్నో అవసరాలను ఇంటర్నెట్ తీరుస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉండే ప్యాకేజీలను సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్నారు. అయితే మన ఫోన్లో మనకు తెలియకుండానే కొంత ఇంటర్నెట్ వినియోగం జరిగిపోతుంటుంది. దానిని నివారించడం, సెర్చ్ చేసేటప్పుడు మనకు ఏది అవసరమో దానినే సెర్చ్ చేస్తే డేటా వినియోగం తగ్గుతుంది. ఫలితంగా మరికొంత సమయం ఇంటర్నెట్ వాడుకునే వీలుంటుంది. ఈ వారం టెక్నాలజీలో తక్కువ డేటా వినియోగంతో ఎక్కువ సమయం నెట్‌ని యూజ్ చేసుకునే చిట్కాలు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ను సులువుగా, వేగంగా యాక్సెస్ చేసి అందించడంలో స్మార్ట్‌ఫోన్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి. గతంలో ల్యాప్‌ట్యాప్ ద్వారా చేసిన పలురకాల పనులను ఇటీవల స్మార్ట్‌ఫోన్స్‌తోనే పూర్తి చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్స్‌లో ఇంటర్నెట్ కావాలంటే ప్రత్యేకంగా మొబైల్ డేటాను రీచార్జి చేసుకోవాలి. ఇంటర్నెట్ను ఉపయోగించే దాని ప్రకారం ఈ డేటా అయిపోతుంటుంది. ఎంత మేర డేటా రీచార్జి చేసుకున్నా డేటా వేగంగా అయిపోతుంటుంది. మొబైల్లో ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి… బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్న సమయంలో ఏ విధమైన సూచనలు పాటించాలో ఈ వారం టెక్నాలజీలో తెలుసుకుందాం..
స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించే వారందరికీ మొబైల్ డేటాపై అవగాహన ఉంటుంది. ఇంటర్నెట్ కావాలంటే రీచార్జి చేసుకోవడం ద్వారా డేటా లభిస్తుంది. వచ్చిన డేటాను లిమిట్ వరకు వినియోగించుకునే వీలుంది. ఇటీవల మార్కెట్లో అనేక సంస్థలు 4జీ డేటాను ప్రవేశపెట్టాయి. 4జీ డేటాను తీసుకోవడం ద్వారా వేగం ఉంటుంది. అందువల్ల డేటా మొత్తం ఖర్చ య్యే అవకాశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా యూసేజ్‌పై ముఖ్య అంశాలను పరిశీలిద్దాం
ఈ-మెయిల్ ద్వారా వచ్చే ఎటాచ్మెంట్స్ను వై-ఫై ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఈ మెయిల్స్ ద్వారా పలు అటాచ్మెంట్స్ వస్తుంటాయి. వీటిని ఈ మెయిల్ చూసిన వెంటనే ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయ్యే విధంగా ఉంచకూడదు. ఈ మెయిల్స్‌ను చెక్ చేసుకున్న తర్వాత ఎటాచ్మెంట్స్ ఉంటే వీటిని వై-ఫై అందుబాటులో ఉన్న చోట డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ప్రతి కార్యాలయంలోనూ వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. దీనివల్ల మీ మొబైల్లోని డేటా సేవ్ చేసినట్టే. ముఖ్యమైన వీడియోలను వైఫై ద్వారా చూసుకోవడం మంచిది.
ఓపెరా, క్రోమ్ వంటి బ్రౌజర్స్‌లో డేటా డేటా కంప్రెషన్ యుటిలిటీ బిల్ట్ఇన్గా వస్తుంది. దీనివల్ల కొంత డేటా యూసేజ్ సేవ్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమేటిక్ అప్డేట్స్ను ఆన్‌లో ఉంచకూడదు. దీనివల్ల అనేక యాప్స్ నిరంతరం అప్డేట్ అవుతునే ఉంటాయి.
ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లి నా వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. వైఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం ద్వారా మీ మొబైల్ నుంచే నెట్‌ని వినియోగిస్తూ పనులు పూర్తి చేసుకునే వీలుంది. కొన్ని చోట్ల సెక్యూరిటీ లేకుండా వైఫై ఉంటుంది. ఇటువంటి వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవడం చాలా ఇబ్బంది కరమైన విషయమైనా నెట్‌ను ఇతరులు సులువుగా ఉపయోగిస్తారు. దీని వలన తెలియకుండానే మన ఇంటర్నెట్ డేటా ఖర్చవుతుంది. అందువల్ల మీరు తీసుకున్న నెట్‌కు రూటర్ ద్వారా వైఫై ఉంచినప్పటికీ తప్పకుండా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంచుకోవాలి. పాస్‌వర్డు ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఇతరులు సులువు గా మన నెట్ ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ ను సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా మనకే ఇబ్బంది వస్తుంది. మనం వినియోగిస్తున్న ఐపీ రికార్డు అవుతుంది. కాబట్టి సమస్యలు తలెత్తకుండా వైఫైను జాగ్రత్తగా వినియోగించుకోవాలి.