చూడగానే తినాలనిపించే కీరదోస వేసవిలో సాంత్వననివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవశ్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఇవేకాకుండా కీలదోసలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.

1. కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది .. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది.

2. వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసం తో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది.

3. కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్ధరైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుంది.

4. కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును , కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.

5. శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

7. దోస తొక్కలో విటమిన్ కె సమృద్ధిగా ఉన్నందున చర్మానికి మేలు చేకురుతుంది. అంతేకాకుండా దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.

8. తీవ్రమైన ఎండ వలన చర్మము కమిలిపోతుంది. అప్పుడు కీరదోసకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. కీరదోసకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి.