ఈ వంతెన పేరు యావుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జ్. ఒట్టోమాన్‌ను పాలించిన రాజు యావుజ్ సుల్తాన్ సెలిం జ్ఞాపకార్థం ఆయన పేరు ఈ వంతెనకు పెట్టారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్ కష్టాలు చాలా తగ్గాయి.
యూరప్, ఆసియాలను కలుపుతున్న వంతెన ఇది. బాస్పోరస్ అనే జలసంధిపై నిర్మించారు.ప్రపంచంలో వెడల్పయిన సస్పెన్షన్ బ్రిడ్జ్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఈ వంతెనకు డిజైన్ రూపొందించింది ఫ్రాన్స్‌కు చెందిన మైఖెల్ విర్లోజెక్స్ అనే ఇంజనీర్.
ఒక దిశలో మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లుంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. అంటే రెండు దిశలలో కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.
రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. వేలమంది కార్మికులు రెండేళ్లు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.